ETV Bharat / bharat

ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంలో మరో వ్యాజ్యం

author img

By

Published : Jan 10, 2022, 11:50 PM IST

PM security breach matter
'కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలి'

PM security breach: పంజాబ్​లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో మరో పిటిషన్​ దాఖలైంది. ఈ విషయంలో పంజాబ్​ ముఖ్యమంత్రి, డీజీపీ, ఇతర అధికారుల పాత్రపై విచారణ జరపాలని పిటిషనర్​ కోరారు.

PM security breach: జనవరి 5న పంజాబ్​లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్​ దాఖలైంది. ఈ అంశంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిరుధ్‌ తివారీ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సిద్ధార్థ్‌ చటోపాధ్యాయ, ఫిరోజ్‌పుర్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ హర్మన్‌దీప్‌ సింగ్‌ హన్స్‌ పాత్రపై జాతీయ దర్యాప్తు సంస్థ లేదా మరేదైనా ప్రత్యేక ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని పిటిషనర్​ కోరారు.

పంజాబ్‌లో మోదీ భద్రతకు భంగం వాటిల్లిందని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ చేసిన పిటిషన్‌ను ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ అంశంపై విచారణకు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటికే భద్రతా లోపాలపై సమాంతర విచారణ చేపడుతున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ కమిటీ దర్యాప్తుపై స్టే విధించింది.

ఇదీ చూడండి: 'మోదీ కాన్వాయ్ ఆపింది మేమే'.. సిక్కు వేర్పాటువాదుల ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.