ETV Bharat / bharat

ఇవి ఖైదీలు తయారు చేసిన చెప్పులు బాసూ!

author img

By

Published : Nov 19, 2020, 6:13 AM IST

ఖైదీలు వస్త్రాలు తయారు చేస్తారని తెలుసు. పెట్రోల్​ బంకుల్లో పని చేస్తారనీ తెలుసు. కానీ, చెప్పుల్ని తయారీ చేస్తున్న ఖైదీల గురించి తెలియాలంటే.. కేరళ వెళ్లాల్సిందే! 'ఫ్రీడమ్​ వాక్'​ పేరుతో అక్కడి ఖైదీలు.. పాదరక్షలను తయారు చేస్తున్నారు. సరసమైన ధరల్లో వాటిని విక్రయించి, అందరి మన్ననలను పొందుతున్నారు.

'Freedom walk' chappals from Central Prisons hit the markets
ఇవి ఖైదీలు తయారు చేసిన చెప్పులు బాసూ!

కేరళలోని ఓ జైలు అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఖైదీలను పాదరక్షల తయారీలో భాగస్వామ్యులను చేస్తున్నారు. వాళ్లు తయారు చేసిన చెప్పులను సరసమైన ధరల్లో విక్రయిస్తున్నారు. 'ఫ్రీడమ్​ వాక్'​ బ్రాండ్​ పేరుతో తిరువనంతపురంలోని పూజప్పుర కేంద కారాగార ఖైదీలు వీటిని తయారు చేస్తున్నారు.

యంత్రాలు తెచ్చి..శిక్షణ ఇచ్చి..

కారాగారంలో రూ.కోటితో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ పాదరక్షల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఇందుకోసం రూ.3 లక్షలు విలువ చేసే యంత్రాలను తీసుకువచ్చారు. మొదటి దశలో ఐదుగురు ఖైదీలకు తయారీలో శిక్షణ ఇప్పించారు. ఇంతకుమందు ఇదే జైలులో ఖైదీలతో చపాతీలు, శానిటైజర్లు, మాస్కులు తయారు చేయించారు.

ఫస్ట్​డే.. సూపర్​ డిమాండ్​

తాము తయారు చేసిన చెప్పులను జత రూ.80కి అమ్ముతున్నారు ఇక్కడి ఖైదీలు. ప్రస్తుతం జైలు క్యాంటీన్​ పరిసరాల్లోనే వీటిని విక్రయిస్తున్నారు. మెదటి రోజే మూడు వందల జతల చెప్పులను ఖైదీలు విక్రయించారు. చెప్పుల తయారీలో మరింత మంది ఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి:'ఛఠ్​​పూజ'లో ముస్లిం మహిళల పొయ్యిలే ప్రత్యేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.