ETV Bharat / bharat

రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 4:46 PM IST

Updated : Dec 8, 2023, 6:33 PM IST

Free Travel in Buses for Telangana Women from Tomorrow : శనివారం మధ్యాహ్నం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కానుంది. అందుకు తగిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వివరించారు.

Free Travel in Buses for Telangana Women
Free Travel in Buses for Telangana Women from Tomorrow

Free Travel in Buses for Telangana Women from Tomorrow : రేపు మధ్యాహ్నం నుంచి తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో మహిళలకు ఈ ఉచిత ప్రయాణం ఉండనుంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్​జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అర్హులు. రాష్ట్ర పరిధిలోని ఆర్టీసీ బస్సులకు మాత్రమే ఈ ఫ్రీ ప్రయాణం ఉండనుంది.

Women Free Bus Travel Scheme in Telangana : మహిళా ప్రయాణికుల ఛార్జీ మొత్తాన్ని ఆర్టీసీ ప్రభుత్వమే చెల్లించనుంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. గురువారం కేబినెట్​లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంపై చర్చించారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని లాంఛ్​ చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. మహాలక్ష్మి పథకంపైనే నిన్నటి కేబినెట్​లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కేబినెట్​ మీటింగ్​ అనంతరం మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​ కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

RTC MD Sajjanar Explaining About Free Bus Travel Scheme 2023 : రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు నిర్ణయం తీసుకుందని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారన్నారు. హైదరాబాద్​లోని బస్​ భవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మహాలక్ష్మి పథకానికి సంబంధించిన వివరాలను తెలిపారు.

రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్​ ఇస్తారని వివరించారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాఆమకు మేలు జరుగుతుందని చెప్పారు. కొవిడ్​ వల్ల ప్రజారవాణాకు తీవ్ర విఘాతం కలిగిందని ఆవేదన చెందారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందని హర్షించారు.

"రాష్ట్రం, కేంద్రం జారీ చేసే ఏదైనా గుర్తింపు కార్డు చూపాలి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. మహిళలు బస్సు ఎక్కడైనా ఎక్కవచ్చు. ఎక్కడైనా దిగవచ్చు. ఉచిత ప్రయాణాలకు ఎలాంటి పరిమితులు, షరతులు లేవు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రోజుకు ఎన్నిసార్లయినా వెళ్లవచ్చు. మహిళల టికెట్‌ ఛార్జీల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది." - సజ్జనార్​, ఆర్టీసీ ఎండీ

రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం

సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణం : ఈ పథకం ద్వారా మహిళల స్వయం శక్తి మెరుగవుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వివరించారు. ట్రాఫిక్​ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందికి నిబంధనలు జారీ చేశామన్నారు. వయసుతో సంబంధం లేకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.

Last Updated : Dec 8, 2023, 6:33 PM IST

TAGGED:

bus
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.