ETV Bharat / bharat

Former CBI Director Comments on Chandrababu Remand Report: కాకమ్మ కథలా.. సీఐడీ రిమాండ్‌ రిపోర్టు: సీబీఐ మాజీ డైరెక్టర్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 9:21 PM IST

Former CBI Director Comments on Chandrababu Remand Report
Former CBI Director Comments on Chandrababu Remand Report

Former CBI Director Comments on Remand Report: చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి.. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టు అంతా కాకమ్మ కథలా ఉందని.. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావు అన్నారు. తప్పుడు సమాచారంతో కోర్టులో వాదనలు వినిపించారని నాగేశ్వరరావు ఆరోపించారు. కేసుకు సంబంధం లేని ఉదారహరణలు కోర్టులో ప్రస్తావించారన్నారు.

Former CBI Director Comments on Remand Report: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధ్నరాలు రాస్తారోకొలు చేస్తున్న నేపథ్యంలో... చంద్రబాబుకు మద్ధతుగా పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. రాజకీయ నాయకులే కాంకుండా... వివిధ రంగాలకు చెందిన పలువురు మేదావులు సైతం చంద్రబాబు అరెస్ట్​ను తప్పుబడుతున్నాయి. తాజాగా చంద్రబాబు(Chandrababu) అరెస్టుకు సంబంధించి కోర్టులో సీఐడీ(CID) దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టుపై... సీబీఐ మాజీ డైరెక్టర్(Ex-CBI director) ఎం.నాగేశ్వరరావు స్పందించారు.

CID Remand Report: రిమాండ్‌ రిపోర్టు అంతా కాకమ్మ కథలా ఉందని, నాగేశ్వరరావు అన్నారు. అధికారలు తప్పుడు సమాచారంతో కోర్టులో వాదనలు వినిపించారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధం లేని ఉదాహరణలు కోర్టులో ప్రస్తావించారన్నారు. వేర్వేరు కేసులో ఇచ్చిన తీర్పులు తప్పుగా చెప్పారన్న నాగేశ్వరరావు(Nageswara Rao), వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తప్పుగా ప్రస్తావించారన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మెుదలైన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

Chandrababu CID Remand Report: రిమాండ్​ రిపోర్ట్​లో ఏముందంటే.. ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చిన సీఐడీ స్కిల్ డెవలప్​మెంట్​ వ్యవహారంలో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ 37 గానే పేర్కోంటునే అభియోగాలను పేర్కోంది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారానికి సంబంధించిన నేరంలో ఆయనే ముఖ్యమైన కుట్రదారని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కోంది. 2021 డిసెంబరు 9 కంటే ముందు ఈ నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని వెల్లడించింది.

Woman Got Job due to Skill Development Corporation: చంద్రబాబు మచ్చలేని మనిషి.. మా కోచింగ్ ఖర్చు తిరిగి ఇచ్చేందుకు సిద్ధం: భావన

Skill Development Scam Case: స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్ల రూపాయలను చెల్లించారని పేర్కోంది. ఇందులో 279 కోట్ల రూపాయల మేర ప్రజాధనం షెల్ కంపెనీలకు దారి మళ్లాయని పేర్కోంటూ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. ఏపీలోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అమలు కోసం సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , మెస్సర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ పేరిట ఈ కుంభకోణం జరిగిందని పేర్కోంది. రాష్ట్రవ్యాప్తంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు అలాగే 36 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేయటం లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నారని.. సీమెన్స్ ద్వారా చేపట్టనున్న ప్రాజెక్టు వ్యయాన్ని 3281 కోట్ల రూపాయల మేర ఉంటుందని పేర్కోన్నారని స్పష్టం చేసింది. ఇందులో 10 శాతం రాష్ట్రవాటాగా జీవో నెంబరు 4 ద్వారా టెక్నాలజీ భాగస్వాములైన మెస్సర్స్ డిజైన్ టెక్ లిమిటెడ్ కు 371 కోట్లను విడుదల చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

చెల్లింపులు జరిగిన మొత్తానికి సంబంధించిన వస్తుసేవలను మెస్సర్స్ డిజైన్ టెక్ సంస్థ ప్రభుత్వానికి అందించలేదని సీఐడీ స్ఫష్టం చేసింది. అలాగే 241 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల్లో నకిలీ బిల్లులు ఉన్నట్టుగా మహారాష్ట్రలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు పేర్కోంది. అసలు స్కిల్ ఎక్స్ లెన్స్ కేంద్రాలకు ఎలాంటి పరికరాలు, సాఫ్ట్ వేర్ సరఫరా చేయకుండా నకిలీ బిల్లులతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని రిమాండ్ రిపోర్టులో అభియోగం మోపింది. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి హవాలా ద్వారా నిధులు కాజేశారని పేర్కోంది.

చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ..నిర్ణయం రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.