ETV Bharat / bharat

విమానంలో ఒక్కరే ప్రయాణిస్తే ఆ కిక్కే వేరప్పా!

author img

By

Published : May 26, 2021, 8:43 PM IST

వందల మంది ప్రయాణించే విమానంలో ఒక్కరే ప్రయాణిస్తే ఎలా ఉంటుంది. ఆ అనుభూతే వేరు కదా!. అయినా.. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. ఏ రాజకీయ నాయకులకో సాధ్యం అవుతుంది. కానీ ఓ సాధారణ ప్రయాణికునికి ఇలాంటి అవకాశం లభించింది.

Man travels alone in aeroplane
విమానంలో ఒక్కడే ప్రయాణించిన వ్యక్తి

ఒక్క వ్యక్తి కోసం విమానం నడిపిన ఎమిరేట్స్ లైన్స్

ముంబయి నుంచి దుబాయ్​కి విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. 360 సీట్లున్న బోయింగ్- 777 విమానంలో అతనొక్కడే ప్రయాణించడమే ఇందుకు కారణం.

స్టార్ జమ్​ సంస్థకు సీఈఓగా పనిచేస్తున్నారు భవేశ్​ జవేరీ. కంపెనీ కార్యాలయం దుబాయ్​లో ఉన్నందున తరచుగా అక్కడికి వెళ్తుంటారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది యూఏఈ. దీంతో ఆ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎవరూ లేనందున మే 19న దుబాయ్​కి వెళ్లే విమానంలో అతనొక్కడే వెళ్లాడు. మరిచిపోలేని ప్రయాణమని అంటున్నాడు భవేశ్​.

అయితే.. దుబాయ్​ నుంచి వచ్చిన బోయింగ్​ 777 తిరిగి దుబాయ్​ వెళ్లాల్సి ఉందని ఎమిరేట్స్​ ఎయిర్​ లైన్స్​ సిబ్బంది వెల్లడించారు.

ఇదీ చదవండి: 13 మందితో 'ఆమె' పెళ్లి- మరొకరిని చేసుకునేలోపే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.