ETV Bharat / bharat

నితీశ్​​కు షాక్.. భాజపాలోకి జేడీయూ ఎమ్మెల్యేలు.. శాసనపక్షం విలీనం

author img

By

Published : Sep 3, 2022, 10:10 AM IST

FIVE JDU MLAS JOIN
నితీశ్ కుమార్

Five JDU MLAS Join Bjp: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్​కు భారీ షాక్ తగిలింది. జేడీయూకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు.. భాజపాలో చేరారు. దీంతో జేడీయూ శాసనపక్షం భాజపాలో విలీనమైంది.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్‌కు మణిపుర్​లో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్​కు చెందిన జేడీయూ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాలో శుక్రవారం చేరారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. మూడింట రెండింట మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన నేపథ్యంలో.. జేడీయూ శాసనపక్షాన్ని.. భాజపాలో విలీనం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ ప్రకటించారు. వీరికి పార్టీ ఫిరాయింపులు చట్టం వర్తించదని అన్నారు.

ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తమ పార్టీ శాసనసభ్యులను భాజపాలో చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమని జేడీయూ ఆరోపించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 38 స్థానాల్లో పోటీ చేసి.. ఆరు స్థానాల్లో విజయం సాధించింది. గెలిచిన వారిలో ఒక ఎమ్మెల్యే తప్ప మిగతావారందరూ భాజపాలో చేరారు. పార్టీ ఫిరాయించిన జేడీయూ ఎమ్మెల్యేల్లో కెహెచ్ జోయ్‌కిషన్, ఎన్ సనాతే, మహ్మద్ అచ్చబుద్దీన్, ఏఎం ఖౌటే, తంగ్జామ్ అరుణ్ కుమార్ ఉన్నారు.

ఏఎం ఖౌటే, అరుణ్‌ కుమార్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి టికెట్ ఆశించారు. అయితే భాజపా వారికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల జేడీయూ నుంచి ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు. ఈశాన్య రాష్ట్రాల్లో జేడీయూ అంతకంతకూ పట్టు కోల్పోతుంది. కొన్ని రోజుల క్రితం అరుణాచల్​ ప్రదేశ్​లో జేడీయూకు ఉన్న ఏకైక శాసనసభ్యుడు భాజపాలో చేరారు. ఇటీవల బిహార్​లో భాజపాతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు జరగడం గమనార్హం.

ఇవీ చదవండి: 'భారత జాతీయ భాషగా సంస్కృతం'.. సుప్రీంకోర్టు ఏమందంటే?

'తన కుమార్తెకే కాంట్రాక్ట్​ ఇచ్చుకున్నారు.. లెఫ్టినెంట్​ గవర్నర్​ను తొలగించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.