ETV Bharat / bharat

రూ.86లక్షల మోసం! షారుక్​ భార్య గౌరీ ఖాన్​పై కేసు

author img

By

Published : Mar 2, 2023, 10:32 AM IST

Updated : Mar 2, 2023, 10:43 AM IST

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​ భార్య గౌరీ ఖాన్‌పై లఖ్​నవులో చీటింగ్ కేసు నమోదైంది. ముంబయికి చెందిన వ్యక్తి వీరిపై ఫిర్యాదు చేశారు.

FIR lodged against Shahrukh wife gauri kha
షారుఖ్​ ఖాన్​ భార్య గౌరి ఖాన్​పై కేసు నమోదు

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ భార్యపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ ప్లాట్ విక్రయానికి సంబంధించి.. తనను మోసం చేశారని పేర్కొంటూ ముంబయికి చెందిన వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు.
ఉత్తరప్రదేశ్​లోని లఖ్​నవుకూ చెందిన తులసియానీ కంపెనీ ఒక వ్యక్తికి ప్లాటును అమ్మింది. సకాలంలో ప్లాటును తనకు ఇవ్వకుండా వేరే వారికి విక్రయించారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్​ ప్రమోట్ చేయడం వల్లనే ప్లాటును కొనుగోలు చేశామని ..ఇప్పుడు కంపెనీ వారు మోసం చేశారని బాధితుడు వారిపై కేసు నమోదు చేశాడు. బాధితుడు ఫిబ్రవరి 25న కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

బాధితుడు కిరీట్ జస్వంత్ సాహ్ మహారాష్ట్ర ముంబయిలోని అంధేరీ ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను చెప్పిన వివరాల ప్రకారం.. 2015 సంవత్సరంలో గౌరీ ఖాన్​ లఖ్​నవూకు చెందిన తులసియానీ కంపెనీని ప్రమోట్ చేశారు. లఖ్​నవూలోని షాహిద్​పాత్​లో తులసియానీ కంపెనీ.. ఒక టౌన్​షిప్​ను అభివృద్ధి చేస్తోంది. గౌరీ ఖాన్​ ప్రకటనను చూసిన తర్వాత జస్వంత్.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియానిని సంప్రదించాడు. వారిద్దరూ రూ.86 లక్షలకు ప్లాటును అమ్మడానికి డీల్ ఫిక్స్ చేశారు.

2015 ఆగస్టులో ఫ్లాట్ కోసం బ్యాంకు నుంచి రూ.85.46లక్షలు అప్పు తీసుకుని ప్లాటుకు కట్టానని బాధితుడు చెప్పాడు. 2016 అక్టోబర్​లో ప్లాటును రిజిస్ట్రేషన్​ చేసి అప్పగిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. తర్వాత కంపెనీ సరైన సమయంలో కంపెనీ ప్లాటును అప్పగించనందుకు పరిహారంగా రూ.22.70లక్షలు చెల్లించి 6నెలల్లో ప్లాటును అప్పగిస్తామని చెప్పింది. ఇది విఫలమైతే ఇచ్చిన డబ్బులకు వడ్డీతో పాటు మొత్తం తిరిగి ఇస్తామని కంపెనీ చెప్పంది. ఇదిలా ఉండగా కంపెనీ ఆ ప్లాటును వేరొకరి పేరు మీద విక్రయించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు బాధితుడికి తెలిసింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గౌరీ ఖాన్, తులసియాని కంపెనీ ఎండీ, డైరెక్టర్‌పై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కిరీట్ జస్వంత్ సాహ్ ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ తులసియానీ, మహేష్ తులసియానీ, గౌరీ ఖాన్‌లపై అక్రమాస్తుల సెక్షన్ల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుశాంత్ గోల్ఫ్ సిటీ సీఐ శైలేంద్ర గిరి తెలిపారు.

Last Updated : Mar 2, 2023, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.