ETV Bharat / bharat

ప్రియుడిపై ప్రియురాలి కాల్పులు.. పట్టించుకోవటం లేదని..

author img

By

Published : Dec 17, 2021, 8:42 AM IST

తమ మధ్య పెరుగుతున్న దూరాన్ని సహించలేని ఓ మహిళ ప్రియుడిపై కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. బంగాల్​లో జరిగిన ఈ ఘటనలో ప్రియుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మరో ఘటనలో.. 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు దుండగులు.. ఆ ఘటనను వీడియో తీసి బ్లాక్​ మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది.

shoot
కాల్పులు

బంగాల్‌ బర్ధమాన్ జిల్లాలో దారుణం జరిగింది. 'నాలుగేళ్లపాటు కలసిఉన్న తమ బంధాన్ని పట్టించుకోకుండా.. తనను దూరం పెడుతున్నాడని' ఆరోపిస్తూ ఏకంగా ప్రియుడిపైనే కాల్పులకు తెగబడిందో మహిళ. బుధవారం రాత్రి కత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే బుల్లెట్ బాధితుడి పొత్తికడుపును తాకుతూ వెళ్లిందని.. దీనితో పెద్దగా ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.

ఇదీ జరిగింది..

ఉద్యోగం కోసం కొన్ని నెలల క్రితం ఝార్ఖండ్ వెళ్లిన నిందితురాలు.. ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో తన ప్రియుడిని కలవాలని ఉందని.. స్థానిక సర్కస్ మైదానానికి రమ్మని కోరింది. అతను వెళ్లిన అనంతరం ఈ దారుణానికి పాల్పడింది.

"నేను మైదానానికి వెళ్లగానే ఆమె నన్ను కౌగిలించుకుంది. ముద్దు పెట్టుకుంది. కలసి సిగరెట్లు కాల్చాం. ఏమైందో ఏమో.. తుపాకీ తీసి అమాంతం నాపై కాల్పులు జరిపింది"

-బాధితుడు

కాల్పుల అనంతరం అక్కడినుంచి పారిపోయిన మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 'గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య దూరం పెరగడం వల్లే మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని' వెల్లడించారు.

సామూహిక అత్యాచారం.. ఆపై..

రాజస్థాన్​ జైపుర్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు మృగాళ్లు. అంతేగాక ఈ ఘటనను వీడియో చిత్రీకరించిన దుండగులు.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె వాపోయింది.

గత జూన్​లో తాను పొలంలో పనిచేస్తుండగా విశ్వాస్ మీనా, తారాచంద్ మీనా, కృష్ణ మీనా, సచిన్ మీనాలు అపహరించి, సామూహిక అత్యాచారం చేశారని పోలీసులకు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను.. బయటపెడతామని బెదిరించినట్లు వెల్లడించింది.

అయితే ఇటీవలే.. తనను పొలం నుంచి అపహరించేందుకు ప్రయత్నించగా జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. ఆమె సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

"బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాం. ఘటనపై దర్యాప్తు చేపడుతాం" అని సురేంద్ర అనే పోలీసు అధికారి వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.