ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​- వందల కి.మీ. నడిచిన ఆ కూలీ క్షేమంగా ఇంటికి..

author img

By

Published : Dec 12, 2021, 12:57 PM IST

Migrant Worker From Assam Returns Home: హైదరాబాద్​ నుంచి దాదాపు 650 కి.మీ. నడిచి కొద్దిరోజుల క్రితం ఒడిశాలోని లక్ష్మీపుర్​కు చేరుకున్న అసోం వాసి అజయ్​.. తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఈటీవీ భారత్​ ఇందులో కీలక పాత్ర పోషించింది. అజయ్​ జాడను ఈటీవీ భారత్​ ద్వారా తెలుసుకున్న అసోం ప్రభుత్వం.. అతడిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లింది. అసలు అజయ్​ అన్ని కి.మీ. ఎందుకు నడిచాడు? అసలు ఏం జరిగింది? తిరిగి ఎలా చేరాడో? తెలుసుకోండి.

Migrant worker from Assam returns hom
Migrant worker from Assam returns hom

Migrant Worker From Assam Returns Home: తన సొంత గ్రామానికి వెళ్లేందుకు.. వందల కిలోమీటర్లు నడిచిన వలసకూలీ కథ సుఖాంతమైంది. అసోంకు చెందిన వలస కూలీ అజయ్​ బోడులే సుదీర్ఘ కాలం తర్వాత.. క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. తొలుత అసోం నుంచి హైదరాబాద్​కు, మళ్లీ అక్కడి నుంచి ఒడిశా కోరాపుట్​ జిల్లా లక్ష్మీపుర్​కు వచ్చిన అజయ్​ సంబంధిత కథనాలను ఈటీవీ భారత్​ పలుమార్లు ప్రసారం చేసింది. ఇదే అతడిని ఇంటికి చేర్చేందుకు దోహదపడింది.

గువాహటికి చెందిన ఈటీవీ భారత్ జర్నలిస్ట్​.. అజయ్​ ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత.. అసోంలోని యూనిసెఫ్‌ ఒడియా అధికారి లక్ష్మీ నారాయణ్ నందా, ఒడిశాలోని ఎయిడ్-ఎట్-యాక్షన్ స్టేట్​ హెడ్​, యువ సామాజిక కార్యకర్త ఉమీ డేనియల్ ద్వారా ఈటీవీ భారత్‌లో ప్రసారమైన అజయ్​ సంబంధిత వార్తల గురించి అసోం ప్రభుత్వం తెలుసుకుంది. ​

వీరి సంయుక్త కృషితో ఇద్దరు అసోం పోలీసు అధికారులు.. డిసెంబర్​ 11న లక్ష్మీపుర్​ చేరుకున్నారు. అక్కడే రైల్వే సొరంగం పనుల్లో నిమగ్నమైన అజయ్​ను గుర్తించారు. అతడిని ఓ రైలులో ఇంటికి పంపించారు.

Migrant worker from Assam returns home
వలస కూలీని లక్ష్మీపుర్​లో కలుసుకున్న పోలీసులు

650 కి.మీ. ప్రయాణం..

Migrant Workers Walking Home: ఉపాధి కోసం అసోం నాగావ్​ నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్​కు వచ్చాడు అజయ్. అక్కడ భవన నిర్మాణ పనుల్లో మేస్త్రీ​ మోసం చేయటం వల్ల.. చేతిలో చిల్లిగవ్వ లేక, తినేందుకు తిండి లేక కాలినడకన సొంత రాష్ట్రానికి పయనమయ్యాడు. మూడు నెలలుగా సుమారు 650 కిలోమీటర్లు నడిచాడు.

మార్గం మధ్యలో బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునేవాడు అజయ్​. ఏదీ దొరకని సమయంలో మంచి నీళ్లతో సరిపెట్టుకునేవాడు.

650 కిలోమీటర్లు ప్రయాణించి మల్కాన్​గిరి జిల్లా సరిహద్దుల గుండా ఒడిశాలోకి ప్రవేశించాడు అజయ్​. నవంబర్​లో కోరాపుట్​ జిల్లాలోని లక్ష్మిపుర్​కు చేరుకున్నాడు. గువాహటికి వెళ్లే దారి ఏదని స్థానికులను అడుగుతుండగా.. నరేంద్ర గరాడా అనే సామాజిక కార్యకర్త చూసి వివరాలు కనుక్కున్నారు. హైదరాబాద్​ నుంచి గువాహటికి కాలినడకన ప్రయాణం ఎందుకు చేయాల్సి వస్తోందో తెలుసుకుని చలించిపోయారు. అజయ్​ను తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. గువాహటికి చేర్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

అక్కడే పనుల్లో..

లక్ష్మీపుర్​కు సమీపంలోనే రైల్వే సొరంగం పనుల్లో కొంత మంది అసోం కూలీలు పని చేస్తున్నారని తెలుసుకుని.. వారి వద్దకు అజయ్​ను తీసుకెళ్లారు నరేంద్ర. బాధితుడి వివరాలు తెలుసుకున్న అక్కడి వారు.. అతనికి పని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన బంధువుల సమాచారం అందే వరకు వారితో కలిసి పనిచేయాలని అజయ్​ నిర్ణయించుకున్నాడు.

ETV Bharat impact: ఇప్పుడు ఈటీవీ భారత్​ కృషితో తిరిగి ఇంటికి చేరుకోగలిగాడు.

ఇవీ చూడండి: ఉపాధి పేరిట మోసపోయి.. 1200 కి.మీ. కాలినడక

తాత కోసం బాలిక సాహసం- 240 కి.మీ నడుస్తూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.