ETV Bharat / bharat

'తక్షణమే ఆ దేశం వదిలి వచ్చేయండి'.. భారతీయులకు కేంద్రం అలర్ట్!

author img

By

Published : Feb 15, 2022, 12:05 PM IST

Indians to leave Ukraine: ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో ఉంటున్న భారతీయులు.. ముఖ్యంగా విద్యార్థులు తక్షణం స్వదేశానికి రావాలని సూచించింది.

Embassy of India asks Indians to leave Ukraine
Embassy of India asks Indians to leave Ukraine

Indians to leave Ukraine: రష్యా- ఉక్రెయిన్​ మధ్య సంఘర్షణ తీవ్రమవుతోంది. చర్చలకు సై అంటూనే ఉక్రెయిన్​ సరిహద్దుల్లో రష్యా భారీగా సైన్యాన్ని మోహరించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో ఉంటున్న భారతీయులు.. ముఖ్యంగా బస తప్పనిసరి కాని విద్యార్థులు తాత్కాలికంగా తక్షణం స్వదేశం తిరిగిరావాలని సూచించింది.

ఈ మేరకు ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్​కు అనవసర ప్రయాణాలు కూడా మానుకోవాలని అందులో తెలిపింది. ఈనెల 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా పేర్కొన్న నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్​ అధ్యక్షుడు కూడా.. రష్యా 16వ తేదీన తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఇవీ చూడండి: ఉక్రెయిన్​పై రష్యాకు ఎందుకంత కోపం..?

'మా మీద రష్యా దాడి అప్పుడే'.. ఉక్రెయిన్​ అధ్యక్షుడి ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.