ETV Bharat / international

'మా మీద రష్యా దాడి అప్పుడే'.. ఉక్రెయిన్​ అధ్యక్షుడి ప్రకటన!

author img

By

Published : Feb 15, 2022, 4:15 AM IST

Updated : Feb 15, 2022, 6:35 AM IST

Ukraine Russia News: రష్యా తమ దేశం మీద మరికొన్ని గంటల్లో దాడికి దిగుతుందని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​ స్కీ. సరిహద్దులో భారీ ఎత్తున రష్యన్​ బలగాలు మోహరించిన నేపథ్యంలో అధ్యక్షుడి చేసిన వ్యాఖ్యలు స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్​ రాజధానిలోని అమెరికా రాయబారా కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్.

ukraine president
ఉక్రెయిన్​ అధ్యక్షుడు

Ukraine Russia News: ఉక్రెయిన్​ ఆక్రమణే లక్ష్యంగా రష్యా ఆ దేశసరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఆ దేశంలోకి చొచ్చుకెళ్లేందుకు క్రిమియా, బెలారస్‌తో పాటు తూర్పు ఉక్రెయిన్‌లలో రష్యన్​ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే రష్యా.. ఉక్రెయిన్​పై దాడి చేయొచ్చు అని అమెరికా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలోదిమిర్​​ జెలన్‌ స్కీ ఫేస్​బుక్​ పోస్ట్​ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 16నే (బుధవారమే) ఉక్రెయిన్​పై రష్యా బలగాలు దాడికి దిగుతాయని, ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్​ ప్రజలు అందరూ ఐకమత్యంగా ఉండాలని.. ఇందుకు ప్రతీకగా అదే రోజును ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

రాయబార కార్యాలయం తరలింపు..

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా.. పశ్చిమాన ఉన్న లివివ్​ నగరానికి తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్​ వెల్లడించారు. ​సరిహద్దులో రష్యా బలగాల కదలికలు వేగవంతం అవడం వల్ల తమ అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

రష్యా ఇప్పటికే సరిహద్దులో లక్షకు పైగా సైనిక బలగాలను మోహరించింది. రష్యా చర్యలపై అమెరికా, నాటో దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆ దేశం వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్​పై రష్యా ఎప్పుడైనా దాడి చేయవచ్చని అమెరికా హెచ్చరిస్తుంటే.. అలాంటిదేమీ లేదంటూ ఆ విషయాన్ని రష్యా ఖండిస్తూ వస్తోంది. ఉక్రెయిన్​పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్​ ఇప్పటికే హెచ్చరించారు.

ఇదీ చూడండి : ఉక్రెయిన్​పై రష్యాకు ఎందుకంత కోపం..?

Last Updated :Feb 15, 2022, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.