ETV Bharat / bharat

ఈ-బైక్​లో మంటలు.. లక్కీగా కొద్ది నిమిషాల ముందే...

author img

By

Published : Apr 25, 2022, 7:11 PM IST

Electric Scooter Catch fire
ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మంటలు

Electric Scooter Catch fire: ఆసుపత్రి ముందు పార్క్​ చేసిన కొద్ది సమయానికి ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు భార్యాభర్తలు. ఈ సంఘటన తమిళనాడులోని విల్లుపురమ్​ జిల్లాలో సోమవారం జరిగింది.

Electric Scooter Catch fire: ఎలక్ట్రిక్​ వాహనాల్లో మంటలు చెలరేగుతున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడు, విల్లుపురమ్​ జిల్లాలోని తిండివనమ్​లో ఆసుపత్రి ముందు పార్కింగ్​ చేసిన ఓ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మంటలు చెలరేగి దగ్ధమైంది. చికిత్స కొసం వచ్చిన దంపతులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఇదీ జరిగింది: తిండివనమ్​కు చెందిన జయభారతి అనే వ్యక్తి తన భార్యను చికిత్స నిమిత్తం ఎలక్ట్రిక్​ స్కూటర్​పై ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోడ్డు పక్కన పార్క్​ చేసి ఆసుపత్రి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సమయానికే స్కూటర్​లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మంటల్లో స్కూటర్​ పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: Prathidhwani: ఎలక్ట్రిక్​ బైకులు ఎందుకు పేలుతున్నాయి.. ప్రమాదాలను నివారించడమెలా?

'నిన్ననే కొన్నారు.. ఇవాళ పేలింది.. ఒకరు చనిపోయారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.