ETV Bharat / bharat

TSPSC Paper Leak Case: మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు

author img

By

Published : Apr 14, 2023, 12:09 PM IST

TSPSC
TSPSC

TSPSC Paper Leak Case Update: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిని శంకర్​లక్ష్మిని సుదీర్ఘంగా విచారించి ఆమె వాగ్మూలాన్ని నమోదు చేశారు. మరోవైపు కేసుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారుల నుంచి ఇప్పించాలని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.

TSPSC Paper Leak Case Update: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర్​లక్ష్మిని గురువారం రోజున ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 9 గంటల పాటు విచారణ జరిపి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. తదుపరి విచారణకు ఆధార్ కార్డు, పాన్​కార్డ్​ తీసుకుని రావాలని ఆదేశించారు. కేసులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డిల గురించి ఆమె వద్ద వివరాలను సేకరించినట్లు సమాచారం. అవసరమైతే వారిని విచారణకు మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు తెలిసింది.

ల్యాప్​ ట్యాప్, ప్రింటర్​తో జైల్​లోకి అనుమతించండి?: ఈ కేసులో ప్రధాన నిందుతులుగా ఉన్న ప్రవీణ్​, రాజశేఖర్​రెడ్డిలను కస్టడీకి ఇవ్వాలని ఈడీ వేసిన పిటిషన్​పై గురువారం రోజున నాంపల్లి కోర్టులో వాదనలు జరిపారు. అయితే కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇద్దరు నిందితులు చంచల్​గూడ జైల్లో ఉన్నందున తామే నలుగురు అధికారులు జైల్​కి వెళ్లి నిందితుల వాగ్మూలాన్ని రికార్డ్ చేస్తామని కోర్టుకు ఈడీ తెలిపింది. ల్యాప్​ ట్యాప్​, ప్రింటర్​తో తమను జైల్లోకి అనుమతించాలని కోరింది.

TSPSC కేసును మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు: ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. టీఎస్​పీఎస్సీ లీక్ కేసులో సిట్ వివరాలు ఇవ్వడం లేదని ఈడీ అధికారులు పిటిషన్​లో పేర్కొన్నారు. పేపర్ లీక్ కేసుకు సంబంధించిన మొత్తం 8 రకాల డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని మార్చ్​ 23న సిట్​కు లేఖ రాశామని కోర్టుకు ఈడీ తెలిపింది. సిట్ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించి, కోర్టు​ దృష్టికి తీసుకువచ్చామని పేర్కొంది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. కేసు వివరాలు ఇచ్చేలా సిట్​కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది. ఈడీ పిటిషన్​పై కౌంటర్​ దాఖలు చేసిన సిట్ అధికారులు కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని పేర్కొంది.

ED investigation on TSPSC paper leak case: మరోవైపు టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్​పై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిని శంకర్​లక్ష్మిని విచారించిన సిట్.. త్వరలో మరికొందరిని టీఎస్​పీఎస్సీ అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనుంది. సాయి లౌకిక్, సుస్మితను ఇవాళ.. సిట్ కస్టడీలోకి తీసుకోనుంది. అయితే వారి ఇద్దరిని 3 రోజుల కోర్టు కస్టడీకి ఇచ్చింది. సాయి లౌకిక్.. ప్రధాన నిందితుడైన ప్రవీణ్​ దగ్గర నుంచి డీఏవో ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన పత్రాని అతను భార్య సుస్మితకు ఇచ్చాడు. ప్రస్తుతం సాయి లౌకిక్, సుస్మిత చంచల్​గూడ జైలులో ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.