ETV Bharat / bharat

ED Notice to Arvind Kejriwal : లిక్కర్ స్కామ్​ కేసులో కేజ్రీవాల్​కు ఈడీ నోటీసులు.. ఆ రోజున రావాలని ఆదేశం

author img

By PTI

Published : Oct 30, 2023, 10:04 PM IST

Updated : Oct 30, 2023, 10:43 PM IST

ED notice Arvind Kejriwal
ED notice Arvind Kejriwal

ED Notice to Arvind Kejriwal : లిక్కర్ స్కామ్​ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ స్కామ్​పై స్టేట్​మెంట్ ఇచ్చేందుకు నవంబర్ 2న తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ED Notice to Arvind Kejriwal : లిక్కర్ స్కామ్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఆప్ మంత్రులు ఈ కేసులో అరెస్టైన నేపథ్యంలో.. తాజాగా కేజ్రీవాల్​కు నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది.

'స్టేట్​మెంట్ రికార్డ్ చేస్తాం'
Delhi Liquor Case Arvind Kejriwal : మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేజ్రీవాల్​కు నోటీసులు పంపినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ కార్యాలయంలోని దర్యాప్తు అధికారి ముందు హాజరైతే ఆయన స్టేట్​మెంట్​ను ఈడీ రికార్డు చేయనుందని వెల్లడించాయి. కాగా, కేజ్రీవాల్​కు సమన్లు పంపించడంపై ఆప్ మండిపడింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర అని ధ్వజమెత్తింది.

  • #WATCH | Delhi: On ED summoning CM Arvind Kejriwal, Delhi Minister Saurabh Bhardwaj says, "As per the news that the Central Government's ED has sent summon to Delhi CM, it gets clear that the Centre has only one aim to somehow finish AAP. They are not leaving a stone unturned in… pic.twitter.com/QHvgBbHrts

    — ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ.. దిల్లీ ముఖ్యమంత్రికి సమన్లు పంపిందని వార్తల ద్వారా తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అర్థమవుతోంది. కేజ్రీవాల్​పై తప్పుడు కేసు పెట్టడానికి ఏ అవకాశాన్నీ వారు వదలి పెట్టడం లేదు. ఆప్​ను పూర్తిగా అంతం చేయాలని అనుకుంటున్నారు."
-సౌరభ్ భరద్వాజ్, ఆప్ నేత, దిల్లీ మంత్రి

ఇదివరకే సీబీఐ నోటీసులు..
ఈ కేసుకు సంబంధించి నమోదు చేసిన ఛార్జ్​షీట్లలో కేజ్రీవాల్ పేరును అనేకసార్లు ప్రస్తావించింది ఈడీ. ఈ కేసులో నిందితులు కేజ్రీవాల్​తో నిరంతరం టచ్​లో ఉన్నారని పేర్కొంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారీ నుంచి అమలు వరకు వివిధ అంశాలపై వీరు ఆప్ అధినేతతో సంప్రదింపులు సాగించారని ఈడీ ఆరోపించింది. అయితే, దీనిపై సీబీఐ సైతం విచారణ జరుపుతోంది. గతేడాది ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో నిందితుడిగా కేజ్రీవాల్ పేరును చేర్చలేదు. అయితే, విచారణకు రావాలని ఈ ఏడాది ఏప్రిల్​లో ఆయనకు సమన్లు పంపించింది.

మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కొందరికి లబ్ధి కలిగేలా పాలసీ రూపొందించడంలో సిసోదియా కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపిస్తోంది.

Delhi Liquor Scam Case AAP MP Arrest : లిక్కర్​ స్కామ్​ కేసులో ఎంపీ సంజయ్​ అరెస్టు.. ఆప్​లో మూడో కీలక నేత..

Delhi Excise Case :​ సిసోదియాకు ఈడీ షాక్​.. రూ.52 కోట్ల ఆస్తులు అటాచ్​!

Last Updated :Oct 30, 2023, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.