ETV Bharat / bharat

జయ మరణంపై సీఎంకు స్టాలిన్​ సవాల్

author img

By

Published : Mar 16, 2021, 8:59 AM IST

Updated : Mar 16, 2021, 10:25 AM IST

అన్నాడీఎంకే తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిందని డీఎంకే చీఫ్ స్టాలిన్​ ఆరోపించారు. తమ పార్టీ ఏం ప్రకటిస్తుందా అని అన్నాడీఎంకే ఎదురుచూస్తోందని ఎద్దేవా చేశారు. జయలలిత మరణంతో తనకు సంబంధం ఉందన్న ఆరోపణల్ని నిరూపించాలని సీఎం పళనిస్వామికి సవాలు విసిరారు స్టాలిన్.

aiadmk
'అన్నాడీఎంకే మా మేనిషెస్టోను కాపీ కొట్టింది'

తమ పార్టీ మేనిఫెస్టోను అన్నాడీఎంకే కాపీ కొట్టిందని ఆరోపించారు డీఎంకే అధినేత స్టాలిన్. ఇటీవల ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో తమ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోకు జిరాక్స్​ కాపీలా ఉందని పేర్కొన్నారు. తిరువరూర్​​లో సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"నేను ఏం ప్రకటిస్తానా అని అన్నాడీఎంకే ఎదురు చూస్తోంది. ఆ పార్టీ ప్రకటించిన రుణ మాఫీ, పింఛన్​ పెంపు, మహిళలకు ప్రోత్సాహకాలు.. ఇవన్నీ డీఎంకే ప్రకటించినవే. అందరికీ విమానాలు పంపిణీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వారు మళ్లీ అధికారంలోకి తిరిగిరారు. నేను మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా ఇక్కడికి వచ్చాను. మీరందరరూ నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గెలిపిస్తారు కదూ?"

-స్టాలిన్, డీఎంకే అధినేత

అన్నాడీఎంకే పదేళ్ల పాలనకు ఇక తెరపడనుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో తమ కూటమి విజయం సాధిస్తుందన్నారు.

dmk
ర్యాలీలో ప్రసంగిస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్

నిరూపించండి..

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సీఎం పళనిస్వామి చేసిన ఆరోపణలను స్టాలిన్ ఖండించారు. మృతికి కారణం తాను అని నిరూపించాలన్నారు. తనపై కేసు నమోదు చేస్తే దానిని చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధం అని అన్నారు.

ఇదీ చదవండి : 'మా పార్టీ మేనిఫెస్టోను డీఏంకే కాపీ కొట్టింది'

Last Updated : Mar 16, 2021, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.