ETV Bharat / bharat

Disabled Boy Plays Football With Single Leg Khammam : ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. ఒంటి కాలుతో ఫుట్​బాల్ ఆడేస్తున్నాడు..శెభాష్ చిన్నా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 1:26 PM IST

Updated : Sep 23, 2023, 2:19 PM IST

Student Talent
Student Talent in Games Without Leg in Khammam

Disabled Boy Plays Football With Single Leg Khammam : ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ బుల్లోడు. రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినా ఆత్మస్థైర్యంతో వైకల్యాన్ని అధిగమించి ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాడు. ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని, పట్టుదలతో శ్రమిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఖమ్మం జిల్లాలోని ఓ బాలుడు.

Student Talent in Games Without Leg in Khammam ఒక్క కాలుతోనే ఆటల్లో రాణిస్తున్న చిన్నారి.. తోడుగా నిలుస్తున్న ఉపాధ్యాయులు

Disabled Boy Plays Football With Single Leg Khammam : ఏమైనా కోల్పోవచ్చుగానీ.. ఆత్మ విశ్వాసం మాత్రం కోల్పోకూడదు అంటారు పెద్దలు. అదొక్కటి ఉంటే చాలు.. కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు. ఆత్మస్థైర్యంతో వైకల్యాన్ని అధిగమించి.. తన ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు వేస్తూ పట్టుదలతో శ్రమిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ బుడతడు. ఒంటి కాలుపై తన పనిని తాను చేసుకుంటూ.. ఇష్టమైన ఆటల్లో రాణిస్తున్నాడు. ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీ ప్రాంతానికి చెందిన శివకుమార్​ అనే బాలుడు.

Khammam Boy Plays Football With Single Leg Khammam : ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీలో నివాసముంటున్న మల్లి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు శివకుమార్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. గత ఏడాది నవంబర్‌లో ప్రమాదవశాత్తు బాలుడిని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో శివకుమార్‌ కాలుకు తీవ్ర గాయం కావడంతో శస్త్ర చికిత్స చేసి తొడ వరకు తొలగించారు. దీంతో చిన్న వయసులోనే ఒక కాలు కోల్పోవడంతో అంగవైకల్యం ఏర్పడినా.. ఆత్మధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. ఒక కాలుతోనే తనకి ఇష్టమైన ఆటలు ఆడటమే కాకుండా ఆసనాలు చేస్తూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

"నిద్రలేచిన దగ్గర నుంచి ఇంటి వద్దనే బాగా ఆడుకుంటాడు. పుట్​బాల్​​ వంటి ఆటలు ఎక్కువగా ఆడతాడు. కాలు లేదనే మాట తప్ప చాలా యాక్టివ్​గా ఉంటాడు. అసలు తన గురించి పట్టించుకోనవసరం లేదు. తోటి పిల్లలతో ఆడుకుంటాడు. ఇటు ఆటలు, అటు చదువులోనూ ఫస్ట్​ ఉంటాడు." - నాగలక్ష్మీ, తల్లి

Boy Talent in Khammam : విద్యార్థి శివకుమార్‌కు చిన్న వయసులోనే అంగవైకల్యం సంభవించడంతో కల్లూరు స్థానిక పాఠశాల ప్రధానోపధ్యాయురాలు కొల్లిపర శ్రీలక్ష్మి తన ఉదారతను చాటుకున్నారు. చురుగ్గా ఉత్సాహంగా ఉండే శివకుమార్‌ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఆ బాలుడికి అన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు. తన తోటి ఉపాధ్యాయులకు విద్యార్థి కుటుంబ పరిస్థితిని చెప్పడంతో వారు స్పందించి రూ.1.2 లక్షలు సాయం చేశారు. ఆ మొత్తాన్ని విద్యార్థి పేరు మీద ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. ప్రమాదంలో కాలు పోవడం చాలా బాధకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలే కాదు చదువులోనూ చాలా చురుగ్గా ఉంటాడని, శివకుమార్‌కు కృత్రిమ కాలు పెట్టిస్తే..ఇంకా రాణిస్తాడని ఆశిస్తున్నారు.

moral stories in telugu: అమ్మలూ మీరు ఇలాగే చేస్తున్నారా.. ఓసారి ఆలోచించండి!

"యాక్సిడెంట్​ అయినప్పుడు లారీ వారే కొంత సొమ్ము పెట్టుకున్నారు. తర్వాత ఉపాధ్యాయుల గ్రూపు సభ్యులు ఎంతో సాయం చేశారు. తనకోసం రూ.1.20 లక్షల వరకు కలెక్టు చేశాం. పై ఖర్చులకు కొంత సొమ్ము ఇచ్చాం. మిగిలిన డబ్బులను విద్యార్థి పేరుతో బ్యాంకులో ఫిక్స్​ డిపాజిట్​ చేశాం. యాక్సిడెంట్​ అయిన తర్వాత ఇంకా యాక్టివ్​గా ఉన్నాడు. చదువులోనూ, ఆటల్లోనూ ముందు వరుసలో ఉంటాడు." - శ్రీ లక్ష్మీ, ప్రధానోపాధ్యాయురాలు

విద్యార్థి తల్లిదండ్రులు రాంబాబు నాగలక్ష్మిలు మట్టి పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. దీంతో వాళ్లకు ఆధార్ కార్డు ప్రాధాన్యత తెలియకపోవటంతో తమ కుమారుడితో పాటు వారికీ ఆధార్ కార్డులు లేవని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అధికారులను కలిసి విన్నవించుకున్నా ఆధార్ కార్డులు రావడంలేదని ఆవేదన చెందారు. ఇప్పుడు ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్​ కార్డు తప్పనిసరి కావడంతో తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని వాపోయారు. ఇప్పటికైనా తమ గోడును అధికారులు పట్టించుకొని.. తమకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

RTC Bus Accident in Yadadri District : ఆటోను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రమాదంలో ఇద్దరు మృతి

తల్లికి న్యాయం చేయడానికి లాయర్​ అయ్యాడు.. ఇంకో స్టూడెంట్​నెం.1 విజయగాథ​

Last Updated :Sep 23, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.