ETV Bharat / bharat

ఉద్యోగం చేస్తూ దూడతో కలిసి 360 కి.మీ నడక.. దేవుడి మొక్కు తీర్చేందుకని..

author img

By

Published : Nov 13, 2022, 9:28 PM IST

ప్రేమగా పెంచుకున్న దూడను ఓ పుణ్యక్షేత్రానికి ఇవ్వాలని 360 కిలోమీటర్లు నడిచాడు ఓ భక్తుడు. 36 రోజులు ప్రయాణం అనంతరం దేవస్థానానికి దూడను దానం చేశాడు. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే తన పయనం కొనసాగించాడు ఆ భక్తుడు.

devotee walked 360 kms
360 నడిచి వెళ్లి దైవుడికి దూడను భహుకరించిన భక్తుడు

దూడతో కలిసి నడుస్తున్న శ్రేయాన్స్

తాను పెంచుకున్న దూడను భగవంతుడికి బహుకరించాలని ఓ భక్తుడు 360 కిలోమీటర్లు నడిచాడు. 36 రోజుల అనంతరం దూడతో పాటు దేవుడి సన్నిధికి చేరుకుని కోరికను నెరవేర్చుకున్నాడు. ఒకపక్క తన ఉద్యోగం చేస్తూనే దూడతో కలిసి నడక కొనసాగించాడు. కర్ణాటక చిక్కమగళూరు జిల్లా కలసలోని హిరేబైలుకు చెందిన శ్రేయాన్ష్ జైన్, ఎస్​డీఎమ్​ ఇన్​స్టిటూషన్​లో చదువు పూర్తి చేశాడు. అనంతరం ఓ సంస్థలో ఉద్యోగానికి కుదిరాడు. అయితే కరోనా కష్టకాలంలో అందరూ ఇబ్బంది పడినట్లుగానే శ్రేయాన్ష్ సైతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. మహమ్మారి దాటికి కుంగిపోకుండా డైయిరీ వ్యాపారం ప్రారంభించాడు.

ఆ సమయంలో శ్రేయాన్స్ ఓ స్వదేశీ గిర్ జాతికి చెందిన ఆవును పెంచుకున్నాడు. ఆ ఆవుకు మొదటి సంతానంగా పుట్టిన దూడను ధర్మస్థల మంజునాథ స్వామి ఇవ్వాలనుకున్నాడు. అనంతరం దూడను తీసుకొని జిగాని ప్రాంతం నుంచి కాలినడక ప్రారంభించాడు. ఆ దూడను ముద్దుగా భీష్మ అని పిలుచుకునేవాడు శ్రేయాన్స్.

36 రోజుల అనంతరం 360 కిలోమీటర్లు నడిచి ధర్మస్థల చేరుకున్నాడు శ్రేయాన్స్. అనంతరం ధర్మస్థల నిర్వాహకుడు వీరేంద్ర హెడ్గేకు భీష్మాను అందించాడు. అయితే శ్రేయాన్స్ తన డైయిరీ వ్యాపారాన్ని కొనసాగిస్తునే ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీస్​కు ఎటువంటి సెలవు పెట్టకుండా, ఉదయం వేళ రిమోట్​ లొకేషన్ ద్వారా పనిచేస్తూ, సాయంత్రం వేల దూడతో కలిసి నడక కొనసాగించేవాడు.

"ఈ 36 రోజుల ప్రయాణంలో నాకు చాలా మంది సహకరించారు. భీష్మకు నాకు ఆహారాన్ని అందించారు. 360 కిలోమీటర్ల దూరం నడవడానికి కేవలం వెయ్యి రూపాయలే ఖర్చయ్యాయి." అని శ్రేయాన్స్ తెలిపారు. ప్రతి గ్రామంలో దూడ ఆరోగ్యాన్ని పరీక్షించేవాడిని, ప్రస్తుతం భీష్మ పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పాడు శ్రేయాన్ష్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.