ETV Bharat / bharat

హఫీజ్ సయీద్​పై అరెస్టు వారెంట్​

author img

By

Published : Feb 7, 2021, 10:12 AM IST

Delhi court issued arrest warrant to Hafiz saeed
హఫీజ్ సయీద్ అరెస్టుకు వారెంట్ జారీ

ముంబయి ఉగ్రదాడుల సూత్రధాని హఫీజ్ సయీద్​పై దిల్లీ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీచేసింది. ఉగ్రకార్యకలాపాలకు సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

పాకిస్థాన్​ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా(ఎల్​ఈటీ) ఉగ్రసంస్థ అధినేత, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​ సయీద్​పై దిల్లీ న్యాయస్థానం శనివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. జమ్ము-కశ్మీర్​లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో ఈ వారెంట్ జారీ అయింది.

దీంతోపాటు ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలాని న్యాయస్థానం ఆదేశించింది. వీరిలో కశ్మీర్ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వాటాలి, వేర్పాటువాద నాయకుడు అల్పాఫ్ అహ్మద్ షా అలియాస్ ఫంతూష్, దుబాయ్​కి చెందిన వ్యాపారవేత్త నావల్ కిశోర్ కపూర్ ఉన్నారు. ప్రస్తుతం వీరు ముగ్గురు తిహాడ్​ కేంద్ర కారాగారంలో ఉన్నారు.

ఇదీ చదవండి:దిల్లీ ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.