ETV Bharat / bharat

డిఫెన్స్​ ఎక్స్​పో వాయిదా.. ఆ సమస్యలే కారణం!

author img

By

Published : Mar 4, 2022, 5:08 PM IST

DefExpo-2022: రెండేళ్లకు ఒకసారి రక్షణ శాఖ నిర్వహించే డిఫెన్స్​ ఎక్స్​పో వాయిదా పడింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా​ తెలిపింది. ఎక్స్​పోలో పాల్గొనేవారికి ఏర్పడిన లాజిస్టిక్​ సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

DefExpo-2022
డిఫెన్స్​ ఎక్స్​పో

DefExpo-2022: గుజరాత్​ గాంధీ నగర్​లో జరగాల్సిన ప్రీమియర్​ డిఫెన్స్​ ఎగ్జిబిషన్-​ 2022 వాయిదా పడింది. పలు రవాణా సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. మార్చి 10 నుంచి 14 వరకు ఈ డిఫెన్స్​ ఎగ్జిబిషన్​ జరగాల్సి ఉంది. అయితే ఇందులో పాల్గొనే వారికి లాజిస్టిక్స్‌ సమస్యలు ఏర్పడినందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రక్షణశాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

గతంలో రక్షణ శాఖ ప్రకటించిన దాని ప్రకారం.. ఈ ఎక్స్​పో లో సుమారు 973 మంది ఎగ్జిబిటర్లు ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తారని తెలిపింది. దీనిలో 63 దేశాల నుంచి 121 మంది విదేశీ ఎగ్జిబిటర్లలు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఎక్స్​పోలో స్వదేశీ భద్రతా వ్యవస్థలకు సంబంధించిన నౌకదళంలో ఉపయోగించే వాటితో పాటు.. నేలపైన నుంచి ప్రయోగించే వాటిని కూడాక ప్రదర్శనకు ఉంచుతున్నట్లు ఫిబ్రవరి 22న అధికారులు తెలిపారు.

తిరిగి ఈ డిఫెన్స్​ ఎక్స్​పో నిర్వహించే తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. డిఫెన్స్​ ఎక్స్​పోను రక్షణ శాఖ రెండేళ్లకు ఒకసారి నిర్వహింస్తుంది. అయితే ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న ప్రదర్శన పన్నెండోవది కావడం విశేషం.

ఇదీ చూడండి:

'ఉక్రెయిన్​లోని భారతీయుల తరలింపుపై కేంద్రం చర్యలు భేష్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.