ETV Bharat / bharat

డబ్బు కోసం స్నేహితుడి హత్య- పొలంలో పూడ్చేసి మూడేళ్లు నాటకం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 11:42 AM IST

Updated : Jan 9, 2024, 11:57 AM IST

Dead Body Found After 3 Years : ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​లో దారుణం జరిగింది. సొంత స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు నలుగురు వ్యక్తులు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. మూడేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా- పోలీసులు తాజాగా కేసును ఛేదించారు.

Dead Body Found After 3 Years
Dead Body Found After 3 Years

Dead Body Found After 3 Years : స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు నలుగురు వ్యక్తులు. అనంతరం మృతదేహాన్ని ఓ పొలంలో ఖననం చేశారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని బిలాస్​పుర్​లో మూడేళ్ల క్రితం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల పాటు తమ మిత్రుడు కనిపించకుండా పోయాడంటూ అందరినీ నమ్మించారు నిందితులు.

ఇదీ జరిగింది
మల్హర్​ చౌకి ప్రాంతానికి చెందిన వికాస్​ అనే యువకుడు గత మూడేళ్ల క్రితం కనిపించకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ కుమారుడి స్నేహితులపైనే అనుమానం ఉందంటూ, వారిని విచారించాలని అనేక సార్లు పోలీసులకు చెప్పారు వికాస్ తల్లిదండ్రులు. చాలా కాలంగా కేసును విచారిస్తున్న పోలీసులు, స్నేహితులను అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టారు.

నగదు విషయంలో వివాదం తలెత్తి వికాస్​ గొంతు నులిమి హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారు. అనంతరం అందరూ కలిసి మృతదేహాన్ని ఓ పొలంలో సమాధి చేసినట్లు అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. జేసీబీ సాయంతో మట్టిని తవ్వి యువకుడి ఎముకలను బయటకు తీశారు. వీటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్​ పరీక్షల కోసం పంపిస్తామని పోలీసులు చెప్పారు. ఫలితాలు వచ్చిన తర్వాతే కేసుపై స్పష్టత వస్తుందని తెలిపారు.

ఫ్రెండ్​ను చంపి మృతదేహాంతో స్కూటీపై సవారీ
Friend Carries Body On Scooty : కొన్ని నెలల క్రితం అసోంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. డ్రగ్స్ మత్తులో స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం ఆ మృతదేహాన్ని స్కూటీపై పెట్టుకుని బయట పారేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే స్థానికులు గమనించడం వల్ల మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. బమునిమెయిదాన్​ రైల్వే కాలనీకి చెందిన రోహిత్ దర్జీ, శుభ్రజీత్​ బోరా ఇద్దరు స్నేహితులు. ఓ రోజు మొత్తం రోహిత్​తోనే సరదాగా గడిపాడు శుభ్రజీత్​​. అనంతరం డ్రగ్స్​ సేవించిన శుభ్రజీత్​, బిజయ జ్యోతి అపార్ట్​మెంట్​లో రోహిత్​​ను హత్య చేశాడు. తర్వాత తన స్కూటీపైనే మృతదేహాన్ని పెట్టుకుని బయట పారేసేందుకు వెళ్లాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే స్థానికులను చూసిన శుభ్రజీత్, మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. రోహిత్​​ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ మత్తులోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

'నా స్నేహితుడిని చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు'.. మృతదేహం కోసం ఏడాదిగా..

స్నేహితుడి ప్రైవేట్ భాగాల్లోకి గాలి కొట్టిన మిత్రుడు.. కడుపు ఉబ్బి మృతి

Last Updated : Jan 9, 2024, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.