ETV Bharat / bharat

భారత్​లో మరో విదేశీ టీకా- మోడెర్నాకు గ్రీన్​సిగ్నల్​

author img

By

Published : Jun 29, 2021, 1:02 PM IST

Updated : Jun 29, 2021, 8:43 PM IST

భారత్​లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది. ఈ టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు.. సిప్లా సంస్థకు డీసీజీఐ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

moderna vaccine
మోడెర్నా టీకాకు డీసీజీఐ అనుమతి!

దేశంలో మోడెర్నా టీకాకు అత్యవసర వినియోగం కింద కేంద్రం అనుమతులు ఇచ్చింది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్​ దిగుమతుల కోసం.. ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

మోడెర్నా వ్యాక్సిన్​ దిగుమతులు, మార్కెటింగ్​ అనుమతుల కోసం.. డీసీజీఐకి సోమవారం దరఖాస్తు చేసింది సిప్లా. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకా అందించనున్నారు.

కొవాక్స్​ టీకా పంపిణీ కార్యక్రమం కింద అమెరికా ప్రభుత్వం కొంత మొత్తంలో మోడెర్నా టీకాలను భారత్​కు ఉచితంగా అందించనుందని కేంద్రానికి ఆ సంస్థ స్పష్టం చేసింది.

మోడెర్నా టీకాను ఎంఆర్​ఎన్​ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. క్లినికల్‌ ప్రయోగాల్లో 90శాతానికి పైనే సమర్థత కనబర్చిన ఈ టీకాకు అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేశాయి.

50 మిలియన్​ డోసులు..

మోడెర్నాను భారత్​లో పంపిణీ చేసేందుకు సిప్లా.. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మోడెర్నాకు అనుమతి లభిస్తే 2022 నాటికి భారత్​కు 50 మిలియన్​ టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి.

విదేశీ టీకాలను భారత్​లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్​ వి టీకాకు భారత్​లో అనుమతి లభించింది. దేశీయంగా.. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి.

ఇదీ చదవండి : Pfizer:త్వరలో ఫైజర్​ టీకాకు భారత్​ అనుమతి!

Last Updated : Jun 29, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.