ETV Bharat / bharat

హత్యాచార నిందితుడిని పట్టించిన శునకం

author img

By

Published : Jun 29, 2022, 12:48 PM IST

Accused find out by dog
Accused find out by dog

Accused find out by dog: కర్ణాటక దావణగెరె జిల్లాలో ఓ పోలీసు శునకం నిందితులకు సింహస్వప్నంలా మారింది. అనేక కేసుల్లో నిందితులను పట్టించిన ఈ శునకం తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఛేదించింది.

Accused find out by dog: 'తుంగ 777 చార్లీ' శునకం దావణగిరి జిల్లా పోలీసులకు వెన్నెముకలా నిలుస్తోంది. అనేక కేసుల్లో నిందితులను పట్టించిన ఈ శునకం తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఛేదించింది. జూన్​ 22న హొన్నాలి తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన నిందితుడు హరీశ్​ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన హొన్నాలి పోలీసులు.. విచారణ చేపట్టారు.

Accused was find out by dog
నిందితుడు హరీశ్​
Accused was find out by dog
విచారణ చేపట్టిన పోలీసులు
Accused find out by dog
నిందితుడి ఇంటి వద్ద శునకం

ఈ క్రమంలోనే నిందితుడి కోసం జిల్లా పోలీసు బ్రిగెడ్​ 'తుంగ 777 చార్లీ' అనే శునకాన్ని రంగంలోకి దించారు పోలీసులు. ఘటనా స్థలానికి వచ్చిన శునకం నేరుగా నిందితుడు హరీశ్​ ఇంటికి వెళ్లి ఆగింది. హత్య చేసిన అనంతరం హరీశ్​.. ఆ ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తుంగ.. నిందితుడు స్నానం చేసిన ప్రదేశానికి సైతం వెళ్లింది. 'తుంగ 777 చార్లీ' 2009 నుంచి పోలీసు శాఖలో పనిచేస్తోంది. ఈ పన్నెండేళ్లలో 70 హత్యలు, 35 దొంగతనాల కేసులను ఛేదించింది.

ఇదీ చదవండి: ఎత్తైన చెట్లపై దూకుతూ కోతిని వేటాడిన చిరుత.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.