ETV Bharat / bharat

దళిత బాలికను రేప్ చేసి దారుణ హత్య!.. ఎముకలు విరిగి.. తల పగిలి..

author img

By

Published : Jun 7, 2022, 12:43 PM IST

UP Dalit girl rape: యూపీలో ఘోరం జరిగింది. దళిత బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఆమె శరీరాన్ని రైల్వే ట్రాక్ వద్ద పడేశారు. బాధితురాలి ఒంటిమీద అనేక గాయాలు కనిపించాయని వైద్యులు తెలిపారు.

dalit teenager murdered
dalit teenager murdered

UP Dalit girl rape: ఉత్తర్​ప్రదేశ్ ఉన్నావ్​లో క్రూరమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన దళిత బాలిక.. శవమై తేలింది. ఆమెపై అత్యాచారం చేసి చంపి ఉంటారని సమాచారం. బాలిక శరీరంలోని ఎముకలు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు.
Dalit teenager rape killing: బంగారమౌ కొత్వాలీ ప్రాంతంలో ఉండే 13 ఏళ్ల బాలిక ఆదివారం రాత్రి బయటకు వెళ్లింది. ఎంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టూ వెతికినా.. ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. కాగా, సోమవారం ఉదయం బాలిక మృతదేహం ఓ రైల్వే ట్రాక్ సమీపంలో కనిపించింది. ఈ ప్రదేశం బాలిక ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉందని పోలీసులు తెలిపారు.

బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాడీకి ఎనిమిది చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయని వైద్యులు తేల్చారు. కొన్ని గాయాలు చాలా లోతుగా ఉన్నాయని గుర్తించారు. తలకు బలంగా గాయం కావడం వల్లే బాలిక మృతి చెందిందని నిర్ధరించారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత చంపేసి ఉంటారని వైద్యులు పేర్కొన్నారు.

dalit teenager murdered
మృతదేహం లభించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు

ఎస్పీ దినేశ్ త్రిపాఠి, అదనపు ఎస్పీ.. బాలిక మృతదేహం లభించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై సత్వరం చర్యలు తీసుకోవాలని పోలీసులను.. ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం, నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గ్రామానికి చెందిన యువకుడే బాలికపై అత్యాచారం చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. నలుగురు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.