ETV Bharat / bharat

కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. బ్రిటిష్ మహిళపై గోవాలో రేప్!

author img

By

Published : Jun 7, 2022, 10:00 AM IST

Updated : Jun 7, 2022, 11:00 AM IST

Father rape daughter: కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దుబాయ్​లో పనిచేసుకునే నిందితుడు ఇండియాకు వచ్చినప్పుడల్లా బాలికపై రేప్ చేస్తున్నాడు. మరోవైపు, గోవాలో బ్రిటన్ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

father-raped-minor-daughter
father-raped-minor-daughter

Father rape daughter: తండ్రీకూతుళ్ల బంధానికి మచ్చతెచ్చే ఘటన మధ్యప్రదేశ్​లో చోటుచేసుకుంది. తండ్రి తన కన్నకూతురిపై పశువులా మీదపడి కోరిక తీర్చుకున్న అవమానకర ఘటన ఇందోర్​లో జరిగింది. 11ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు నిందితుడు. సౌదీ అరేబియాలో ఓ పెట్రోలియం కంపెనీలో పనిచేసే అతడు.. రెండేళ్ల కోసారి ఇందోర్​కు వచ్చేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూతురిపై రేప్ చేసేవాడు. తండ్రి క్రూరత్వాన్ని భరించలేని ఆ చిన్నారి తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించింది.

చిన్నప్పటి నుంచి తన తండ్రి అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలు గోడు వినిపించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బొమ్మలు, చాక్లెట్ల ఆశ చూపించి.. రహస్య భాగాలను తాకేవాడని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని పేర్కొంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడల్లా అత్యాచారం చేసేవాడని చెప్పింది. చివరకు, ఈ విషయం తల్లికి చెప్పింది బాధితురాలు. మొదట దీని గురించి ఆమె నమ్మలేదు. అయితే, కూతురు గట్టిగా చెప్పేసరికి తల్లి విశ్వసించింది. కూతురిని వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్​కు వెళ్లింది. నిందితుడిపై ఫిర్యాదు చేయగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

UP rape news: ఉత్తర్​ప్రదేశ్​ ఎటాలో ఆరేళ్ల బాలికపై 15ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడు, బాధితురాలు ఒకే గ్రామానికి చెందినవారని అదనపు ఎస్పీ ధనంజయ్ కుష్వాహా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని.. చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఝార్ఖండ్ రాంచీలోని నగ్రి ప్రాంతంలో చిన్నారుల సంరక్షణాలయంలో ఉండే ఇద్దరు మైనర్లు లైంగిక వేధింపులకు గురయ్యారు. చిల్డ్రన్స్ హోమ్​లో గార్డుగా పనిచేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. నిందితుడిని ఇల్బియుస్ తోప్పోగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతడిని పట్టుకున్నామని ఎస్పీ నౌషద్ ఆలం తెలిపారు.

British woman Goa sexual assault: మరోవైపు, గోవాలో విదేశీ మహిళపై అత్యాచారం జరిగింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మసాజ్ చేస్తానని చెప్పి మహిళ భాగస్వామి ముందే రేప్ చేశాడు. నార్త్ గోవాలోని స్వీట్ వాటర్ సరస్సు సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

నిందితుడిని విన్సెంట్ డిసౌజాగా (32) గుర్తించారు. ఇతడిని.. అరాంబోల్ బీచ్​లో అక్రమంగా మసాజ్​లు నిర్వహించే ముఠాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. జూన్ 2న ఈ ఘటన జరిగింది. అయితే, యూకేలోని తన కుటుంబ సభ్యులతో చర్చించి, భారత్​లోని బ్రిటిష్ ఎంబసీని సంప్రదించి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది మహిళ. కేసు నమోదైన గంట వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గతంలో స్కూల్ లైబ్రేరియన్​గా పనిచేసినట్లు తెలిపారు. సోమవారం రాత్రే నిందితుడు, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపినట్లు చెప్పారు. ఈ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Last Updated :Jun 7, 2022, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.