ETV Bharat / bharat

LIVE UPDATES: తుపాను ప్రాంతాల్లో టీడీపీ నేతల పర్యటన - ప్రతి గింజా ప్రభుత్వమే కొనాలని డిమాండ్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 7:18 AM IST

Updated : Dec 6, 2023, 6:41 PM IST

Cyclone Michaung LIVE Updates
Cyclone Michaung LIVE Updates

Cyclone Michaung LIVE Updates: మిగ్‌జాం తుపాన్ కారణంగా కురిసిన అతి భారీ వర్షాలకు ఏపీలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. చేతికొచ్చిన వరి ధాన్యం నీటి పాలైంది. నిబంధనలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తుపాను కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు అధికారుల రద్దు చేశారు.

Cyclone Michaung LIVE Updates:

5.33 PM
అల్లూరి జిల్లాలో వరదలో చిక్కుకుని ముగ్గురు గల్లంతు
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం భీంపోలులో ముగ్గురు వ్యక్తులు వరదలో గల్లంతయ్యారు. కాశీపట్నం సంతకు వెళ్లి తిరిగివస్తుండగా లవ్వగడ్డ వాగు దాటుతుండగా వీరు వరదలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారు సీతపాడుకు చెందిన గెమ్మిల్లి కుమార్, మిరియాల కుమార్, గెమ్మిలి లక్ష్మి అని స్థానికులు తెలిపారు.

3.12 PM
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తుపాను సహాయ చర్యలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరగా సాధారణ పరిస్థితి తీసుకురావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. పంట పొలాల్లో వరదనీరు తొలగించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. విద్యుత్‌, రోడ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

1.55PM
రోడ్లపై కూలిన వృక్షాలు - బస్సుల నిలిపివేత
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని పలుచోట్ల ఈదురుగాలులకు రహదారులపై వృక్షాలు నెలకొరిగాయి. రహదారిపై చెట్లు కూలడంతో ఎస్.కోట - అరకు మార్గంలో రాకపోకలకు అంతరాయ కలిగింది. దీంతో ఎస్. కోట డిపో నుంచి అరకు వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు.

02:28 PM
ప్రతి గింజా కొనాలి : ప్రత్తిపాటి
వ్యవసాయ రంగంపై తుపాను తీవ్ర ప్రభావం చూపిందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వరి, వాణిజ్య, ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని, ప్రతి ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. రైతులకు గోనె సంచులు, గోదాముల సదుపాయం కల్పించాలని, తేమ శాతం ఇబ్బందుల్లేకుండా ప్రతి గింజా కొనాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.

తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి
తుపానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో జగన్ విఫలం అయ్యారని టీడీపీ యనమల రామకృష్ణుడు అన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ వదలట్లేదని ఎద్దేవా చేశారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.

01:38 PM
తెలంగాణలో మాదిరే ఇక్కడా మార్పు కోరుకుంటున్నారు
తిరుపతి జిల్లా వెంకటగిరి సవారిగుంటలో ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరుకుంది. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైందని, తెలంగాణలో మాదిరే ఇక్కడా మార్పు కోరుకుంటున్నారని అన్నారు.

01:00 PM
భారీగా వర్షపాతం నమోదు
మిగ్‌జాం తుపాన్‌తో గుంటూరులో భారీగా వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 99.9 మిల్లీ మీటర్లు, 9 మండలాల్లో వంద మి.మీ. పైగా వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. ప్రత్తిపాడు మండలంలో 163 మి. మీ, మెడికొండూరులో 145 మి.మీ, పెదనండిపాడులో 130మి.మీ. నమోదు అయ్యింది.

11 గొర్రెలు మృతి
ప్రకాశం జిల్లా దర్శి మండలం మారేడుపల్లెలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగులో గొర్రెల మంద కొట్టుకుపోయాయి. దీంతో 11 గొర్రెలు మృతి చెందాయి.

కారంచేడు-స్వర్ణ రహదారిపై భారీగా వరద
బాపట్ల జిల్లా కారంచేడు-స్వర్ణ రహదారిపై భారీగా వరద ప్రవాహిస్తుంది.

కూలిన అపార్టుమెంట్‌ గోడ
విశాఖలో పీఎస్‌ వద్ద అపార్టుమెంట్‌ గోడ కూలిపోయింది. దీంతో వాహనాలు దెబ్బతిన్నాయి.

12:20 PM
తహసీల్దార్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వరద
బాపట్ల జిల్లా కారంచేడు వద్ద కొమ్మమూరు కాల్వ ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. కారంచేడు తహసీల్దార్ కార్యాలయాన్ని వరద చుట్టుముట్టింది.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దేవినేని ఉమ పర్యటన
ఎన్టీఆర్ జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దేవినేని ఉమ పర్యటించారు. మైలవరం మండలం మర్సుమల్లిలో దెబ్బతిన్న పంటల పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

ముంపు నీటిలో వరి పంట
కోనసీమ జిల్లా అమలాపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నివాస గృహాల్లోకి వరద చేరుకుంది. పి.గన్నవరం మండలం ముంజవరపు కొట్టు వద్ద వంతెన గోడ పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లోని వరి పంట ముంపు నీటిలోనే ఉంది.

ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకుల డిమాండ్
నెల్లూరు జిల్లా ఎ.ఎస్‌.పేట మండలంలో భారీగా పంట నష్టం జరిగింది. కొత్తపల్లి, అబ్బాసాహెబ్‌పేటలో 400 ఎకరాల్లోని మొక్కజొన్న నేలకొరిగింది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకుల డిమాండ్ చేశారు.

అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం కుంబిడిశింగి వద్ద మత్స్యగెడ్డ ఉద్ధృతిగా ప్రవహిస్తుంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.

దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ధూళిపాళ్ల నరేంద్ర
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మురుకుదురులో నీటమునిగిన దెబ్బతిన్న పంట పొలాలను ధూళిపాళ్ల నరేంద్ర పరిశీలించారు.

3 వేల క్యూసెక్కులు నదిలోకి నీరు విడుదల
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలోకి వరద ప్రవాహిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి పెద్దేరు జలాశయానికి భారీగా వరద చేరుతున్నది. పెద్దేరు జలాశయం 3 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కులు నదిలోకి నీరు విడుదల చేశారు.

కాలనీలు జలమయం 10.38AM కూర్మరాజు
అల్లూరి జిల్లాలోని గోకవరం వద్ద నిర్మించిన పునరావాస కాలనీలు జలమయమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు దేవీపట్నం ముంపు గ్రామాల నిర్వాసితులు వరదల వల్ల ఇబ్బందులను ఎదర్కోంటున్నారు.

11:48 AM
పెద్దేరు జలాశయం 3 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కులు నదిలోకి విడుదల
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలోకి వరద ప్రవాహిస్తుంది.ఎగువ ప్రాంతం నుంచి పెద్దేరు జలాశయానికి వరద భారీగా చేరుతున్నది. పెద్దేరు జలాశయం 3 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కులు నదిలోకి విడుదల చేశారు.

పునరావాస కాలనీలు జలమయం
అల్లూరి జిల్లా గోకవరం వద్ద నిర్మించిన పునరావాస కాలనీలు జలమయం అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు దేవీపట్నం ముంపు గ్రామాల నిర్వాసితుల ఇబ్బందులు పడుతున్నారు.

పంట నష్టం- రైతులు తీవ్ర ఇబ్బందులు
ఏలూరు జిల్లా దెందులూరు, సత్యనారాయణపురంలో వరి నీట మునిగింది. పొలాల్లోకి ప్రవహించిన గుండేరు డ్రెయిన్‌ వరద, తీవ్ర పంట నష్టం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి పర్యటన
బాపట్ల జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడారు.

10:22 AM
పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: పురందేశ్వరి
పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, రైతులకు ఉదారంగా ఆర్థిక సహకారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యాన పంటల రైతులకు వెంటనే ఆర్థిక సహకారం అందించాలని, అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని పురందేశ్వరి కోరారు.

09:50 AM
జలదిగ్బంధంలో గ్రామాలు
బాపట్ల జిల్లా పర్చూరులో పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మిర్చి, పొగాకు, మొక్కజొన్న పంటకు తీవ్రనష్టం కలిగింది. పర్చూరు వాగుకు గండి పడి చెంచుల కాలనీలోకి వరద ప్రవాహిస్తుంది.

కోతకు గురైన తాత్కాలిక కల్వర్టు
అల్లూరి జిల్లా గంగవరం-రంపచోడవరం మార్గంలో తాత్కాలిక కల్వర్టు కోతకు గురైంది. పాడేరు శివారు చిలకలమామిడిగెడ్డ ఉద్ధృతంగా ఉంది. పాడేరు నుంచి హుకుంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి.

నీటమునిగిన జగనన్న కాలనీలు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి, ఉపమాక ప్రాంతాల్లో జగనన్న కాలనీలు నీటమునిగాయి. నర్సీపట్నం చోడవరం మార్గంలో వడ్డాది వంతెన వరకే ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. మాకవరపాలెం మండలం పి.పి.అగ్రహారం వద్ద పొలాల్లోకి వరద ప్రవాహిస్తుంది.

09:35 AM
దెబ్బతిన్న పంటలు
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అమరావతి మండలం పెదమద్దూరు వద్ద వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అమరావతి-విజయవాడ రహదారిపై రాకపోకపోకలు నిలిచిపోయాయి. క్రోసూరు మండలం బయ్యవరం వద్ద లోలెవల్ చప్టాపై, తాళ్లూరు-పరస మధ్య కాలచక్ర రహదారిపై వరద ప్రవహిస్తుంది. వరద ప్రవాహంతో అమరావతి-సత్తెనపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట, క్రోసూరులో దెబ్బతిన్న మిర, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు, అలాగే అమరావతి, పెదకూరపాడులో మిర, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.

09:08 AM
రహదారిపై వరద, నిలిచిపోయిన వాహనాలు
కాకినాడ జిల్లా తుని, కోటనందూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. కోటనందూరు మండలం కాకరాపల్లి వద్ద బొండుగడ్డ వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుంది. తుని-నర్సీపట్నం రహదారిపై వరద, వాహనాలు నిలిచిపోయాయి.

నేలకొరిగిన వరిచేలు
అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట వద్ద కొండ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. కొండ వాగు ఉద్ధృతితో గోకవరం వైపు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం ఉప్పాయపాలెం వద్ద వరిచేలు నేలకొరిగాయి.

ముంపునకు గురైన జగనన్న కాలనీలు
అనకాపల్లి జిల్లా వడ్డాది వద్ద పెద్దేరుపై ఉన్న కాజ్‌వే పైనుంచి వరద ప్రవాహిస్తుంది. నక్కపల్లి మండలంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఎలమంచిలిలో వర్షానికి ముంపునకు జగనన్న కాలనీలు గురైనాయి. నక్కపల్లిలో చేనేత కాలనీ నీటమునిగడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలోని ఎలమంచిలి మండలం ఏటికొప్పాక వద్ద వరాహ నది ఉద్ధృతి ఎక్కువ అయ్యింది. శంకరం వద్ద ప్రమాదకరంగా ఏలూరు కాల్వ ప్రవాహిస్తుంది. గట్టు పైనుంచి పొలాల్లోకి నీటి ప్రవాహం, కాల్వకు గండి పడే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు.

07:55 AM
తిరువూరు నియోజకవర్గంలో పొంగుతున్న వాగులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోవాగులు పొంగుతున్నాయి. కట్లేరు, పడమటి, ఎదుళ్ల, విప్ల, గుర్రపు, కొండ వాగుల ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన తెలంగాణ నుంచి వస్తున్న నీటితో వరద మరింత పెరుగుతుంది.

07:40 AM
పంటల నష్టం రూ.7 వేల కోట్ల పైనే ఉంటుందని అంచనా
మిగ్‌ జాం తుపాను అన్నదాతలకు తీవ్రనష్టం మిగిల్చింది. లక్షల ఎకరాల్లో వరి నేలకొరిగింది. కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. తుపాను దెబ్బతో ఉద్యాన, కూరగాయల పంటలకు నష్టం చేకురింది. పంటల నష్టం రూ.7 వేల కోట్ల పైనే ఉంటుందని అంచనా. వందలాది గ్రామాలకు రెండ్రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

పలు రైళ్లు రద్దు
నేడు విజయవాడ డివిజన్‌లో తిరుపతి, చెన్నై, నెల్లూరు మధ్య అధికారులు 13 రైళ్లు రద్దు పలు రైళ్లు రద్దు చేశారు.

విద్యాసంస్థలకు నేడు సెలవు
తుపాన్ ప్రభావంతో తీరప్రాంతం జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చివ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు.ఈదురుగాలులు, వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ఇస్తునట్లు విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

వంతెనపై వరద ప్రవాహం-70 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం
అల్లూరి జిల్లా జి.ముంచంగిపుట్టు సమీపంలోని వంతెనపై వరద ప్రవాహం ప్రవహిస్తుంది. దీంతో సుమారు 50 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బొక్కెల్లు రాయగడ్డ సమీపంలోని వంతెనపై ప్రవహిస్తున్న వరద కారణంగా సుమారు 20 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎడతెరిపి లేని వర్షంతో వరి పంట నీటమునిగింది.

నిలిచిన విద్యుత్ సరఫరా
బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో 2 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.

07:08 AM
Cyclone Michaung LIVE Updates : మిగ్‌జాం తుపాన్ కారణంగా కురిసిన వర్షంతో బాపట్ల జిల్లా చినగంజాంలో విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి చినగంజాంలో నిలిచిన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.

07:08 AM
పలు విమాన సర్వీసులు రద్దు
తుపాన్ ప్రభావంతో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 20 దేశీయ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

Last Updated :Dec 6, 2023, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.