ETV Bharat / bharat

12-14 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ బుధవారం షురూ

author img

By

Published : Mar 14, 2022, 2:40 PM IST

Covid vaccination: కరోనా టీకా పంపిణీలో మరో ముందడుగు పడనుంది. ఈనెల 16 నుంచే 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్​సుఖ్​ మాండవీయా వెల్లడించారు. 60 ఏళ్లపైబడిన అందరికీ 'ప్రికాషన్​ డోసు' అందించనున్నట్లు స్పష్టం చేశారు.

Covid vaccination
Covid vaccination

Covid vaccination: దేశంలో ఇప్పటికే శరవేగంగా సాగుతున్న టీకా పంపిణీలో మరో ముందడుగు పడనుంది. వ్యాక్సినేషన్​ పరిధిలోకి మరింత మందిని తీసుకొచ్చేందుకు ఈ నెల 16 నుంచే.. 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు టీకా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్​సుఖ్​ మాండవీయా తెలిపారు. వారికి హైదరాబాద్​కు చెందిన 'బయోలాజికల్ ఈ'​ సంస్థ అభివృద్ధి చేసిన.. కార్బెవ్యాక్స్​ను అందించనున్నట్లు సమాచారం.

60ఏళ్లు దాటిన అందరికీ ప్రికాషన్ డోసు పంపిణీ చేయనున్నట్లు మాండవీయా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

  • గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. గత ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్స్​కు (ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ) టీకాలు పంపిణీ ప్రారంభించారు.
  • కరోనా టీకా తదుపరి దశను మార్చి 1 నుంచి.. 60 ఏళ్లు పైబడిన వారికి.. 45 పైబడిన వారికి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • దేశంలో 2021 ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.
  • 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ గత ఏడాది మే 1 నుంచి టీకాలు వేయడానికి అనుమతించడం ద్వారా టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరించింది.
  • కరోనా టీకా తదుపరి దశను ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల వయసున్నవారికి టీకా పంపీణీ ప్రారంభించారు.

ఇదీ చూ డండి: లిఫ్ట్​లో 13 మంది.. రెండున్నర గంటల నరకం.. చివరకు సాహసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.