ETV Bharat / bharat

పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై కేంద్రం కొత్త గైడ్​లైన్స్​ ఇవే..!

author img

By

Published : Feb 3, 2022, 8:44 PM IST

Covid Guidelines In Schools: పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు భౌతిక తరగతులను నిర్వహిస్తున్న నేపథ్యంలో పిల్లల భద్రత విషయంలో సవరించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. పాఠశాలల్లో పిల్లల మధ్య ఆరు అడుగులు దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.

Corona Guidlines
పిల్లలు

Covid Guidelines In Schools: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలో పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యాశాఖ సవరించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండాలని, పరిసరాల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని తెలిపింది. పాఠశాలల్లో పిల్లల మధ్య ఆరు అడుగులు దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ఆవరణలో భౌతికదూరం పాటించేలా చూడాలని, అది సాధ్యంకాకపోతే స్కూల్‌ ఈవెంట్లు నిర్వహించరాదని కేంద్రం స్పష్టంచేసింది. విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలని పేర్కొంది. హాస్టళ్లలో అన్నివేళలా భౌతికదూరం పాటించడంతో పాటు పిల్లల బెడ్‌ల మధ్య దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. ఒకవేళ వారు ఆన్‌ లైన్‌ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలని తెలిపింది. ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, కొవిడ్‌సోకిన పిల్లలపై ప్రత్యేకదృష్టి సారించాలని పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతంగా కరోనా- 50లక్షల టీకాల ఎక్స్​పైరీపై కేంద్రం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.