ETV Bharat / bharat

దేశంలో లక్ష దిగువకు కరోనా కొత్త కేసులు.. పెరిగిన మరణాలు

author img

By

Published : Feb 7, 2022, 9:24 AM IST

Updated : Feb 7, 2022, 9:38 AM IST

Covid Cases in India: భారత్​లో కరోనా కొత్త కేసులు లక్ష దిగువకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 83,876 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 895 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Covid Cases in India
కరోనా కేసులు

Covid Cases in India: భారత్​లో కొవిడ్​ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. తొలిసారి లక్ష దిగువకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జరిపిన 11,56,363 పరీక్షల్లో 83,876 కొత్త కేసులు నమోదయ్యాయి. 895 మంది మరణించారు. 1,99,054 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం మరణాలు: 5,02,874
  • యాక్టివ్ కేసులు: 11,08,938
  • మొత్తం కోలుకున్నవారు: 4,06,60,202

దేశంలో కొత్తగా 14,70,053 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,63,80,755 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి కాస్తా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 18 లక్షల మందికి కరోనా సోకింది. 6 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.58 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,58,393 కు పెరిగింది.

  • రష్యాలో కొత్తగా 1.80 లక్షల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 661 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 1.55 లక్షలకు పైగా కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. మరో 129 మంది చనిపోయారు.
  • జర్మనీలో కొత్తగా 1.14 లక్షల మందికి వైరస్​ సోకగా.. 34 మంది చనిపోయారు.
  • జపాన్​లో తాజాగా 1.05 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 126 మంది బలయ్యారు.
  • నెదర్లాండ్స్​లో ఒక్కరోజే దాదాపు 94 వేల మందికి వైరస్ సోకింది. మరో 9 మంది మృతి చెందారు.

ఇవీ చూడండి:

'అన్ని వేరియంట్లకు ఒకే టీకా'.. భారత శాస్త్రవేత్తల ఘనత

మరో సింగిల్​ డోస్​ కరోనా టీకాకు కేంద్రం అనుమతి

Last Updated :Feb 7, 2022, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.