ETV Bharat / bharat

భారత్​లో కొత్తగా 9 వేల కరోనా కేసులు, జపాన్​, జర్మనీలో లక్షల్లో

author img

By

Published : Aug 17, 2022, 9:47 AM IST

INDIA COVID CASES
INDIA COVID CASES

INDIA COVID CASES: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 9,062 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.25 శాతానికి చేరాయి.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు 9,062 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది మరణించగా.. మరో 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.57 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.24 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా ఉంది.

  • మొత్తం కేసులు: 4,42,86,256
  • క్రియాశీల కేసులు: 1,05,058
  • మొత్తం మరణాలు:5,27,134
  • కోలుకున్నవారు: 4,36,54,064

Vaccination India: భారత్​లో మంగళవారం 25,90,557మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,08,57,15,251కు చేరింది. మరో 3,64,038మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 5,79,794మంది వైరస్​ బారినపడగా.. మరో 1,648 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 596,785,501కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,59,272మంది మరణించారు. ఒక్కరోజే 10,09,443 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,07,98,850కు చేరింది.

  • జపాన్​లో కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. కొత్తగా 1,59,781కేసులు నమోదయ్యాయి. 215 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 84,128 కేసులు వెలుగులోకి వచ్చాయి. 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 67,390 మంది కరోనా బారిన పడగా.. 192 మంది మృతిచెందారు.
  • అమెరికాలో తాజాగా 54,190 మంది కరోనా బారినపడ్డట్లు తేలింది. 262 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి: మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా

కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు, అయినా ఇంట్లోనే కాలక్షేపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.