ETV Bharat / bharat

దేశంలో స్థిరంగా కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే

author img

By

Published : Aug 15, 2022, 9:49 AM IST

Covid Cases in India
Covid Cases in India

INDIA COVID CASES: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. తాజాగా 14,917 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.27 శాతానికి చేరాయి.

Covid Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం 8 గంటల వరకు 14,917 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. 32 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.27 శాతానికి పెరిగాయి.

  • మొత్తం కేసులు: 4,42,68,381
  • క్రియాశీల కేసులు: 1,17,508
  • మొత్తం మరణాలు: 5,27,069
  • కోలుకున్నవారు: 4,36,23,804

Vaccination India: భారత్​లో ఆదివారం 25,50,276 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,08,25,13,831కు చేరింది. మరో 1,98,271మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 5,09,010మంది వైరస్​ బారినపడగా.. మరో 1,020 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,50,96,639కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,54,505 మంది మరణించారు. ఒక్కరోజే 6,90,556 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,82,70,599కు చేరింది.

  • జపాన్​లో కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. కొత్తగా 1,66,611 కేసులు నమోదయ్యాయి. 238 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 1,19,603 కేసులు వెలుగులోకి వచ్చాయి. 57మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో తాజాగా 28,982 మంది కరోనా బాడినపడ్డట్లు తేలింది. 54 మంది ప్రాణాలు కోల్పోయారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.