ETV Bharat / bharat

భారత్​లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొరియాలో 2.7లక్షలు!

author img

By

Published : May 17, 2022, 9:41 AM IST

corona cases
covid cases in india today

Coronavirus Update India: దేశంలో ఒక్కరోజే 1,569 మందికి వైరస్​ సోకింది. మరో 19 మంది చనిపోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది.

Coronavirus Update India: భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,569 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 19 మంది చనిపోయారు. ఒక్కరోజే 2,467 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్​ కేసులు 16,400కు చేరుకున్నాయి. యాక్టివ్​ కేసుల శాతం 0.04గా ఉంది. మరణాల శాతం 1.22గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,25,370
  • మొత్తం మరణాలు: 5,24,260
  • యాక్టివ్​ కేసులు: 16,400
  • కోలుకున్నవారి సంఖ్య: 4.25,84,710

Vaccination India: దేశవ్యాప్తంగా సోమవారం 10.78 లక్షల మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 191 కోట్ల 48 లక్షల 94 వేలు దాటింది. ఒక్కరోజే 3 లక్షల 57 వేల 484కి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజే మరో 7.3 లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1,140 మందికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,28,44,141కు చేరింది. మరణాల సంఖ్య 62,90,347కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,28,40,486గా ఉంది.

  • ఆస్ట్రేలియాలో మరో 42వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 13 మంది మరణించారు.
  • జపాన్​లో కొత్తగా 34వేల మందికి వైరస్​ సోకింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 64 వేల కేసులు, 107 మరణాలు నమోదయ్యాయి.

కొరియాలో కొవిడ్​ పంజా: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా కరోనా బారినపడి 6 మంది మృతిచెందగా.. ‌మరో 2 లక్షల 70వేల మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలకు ఔషధాలను పంపిణీ చేసేలా ఆరోగ్యకార్యకర్తల్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు కిమ్​ జోంగ్​ ఉన్​.

ఇవీ చూడండి:

Shanghai Lockdown: షాంఘైలో లాక్​డౌన్​ ఎత్తివేత!

కొరియాపై కరోనా పంజా.. కిమ్ 'స్పెషల్ ఆపరేషన్'.. వారికి వార్నింగ్!

బస్ డ్రైవర్ నిద్రమత్తుకు 14 మంది బలి.. అప్పటివరకు జాలీగా గడిపి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.