ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : Dec 4, 2021, 10:28 AM IST

Covid Cases In India Today: దేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 415 మంది మరణించారు. 8,190 మంది కోలుకున్నారు.

corona cases
కరోనా కేసులు

Covid Cases In India Today: దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,603 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 3,46,24,360
  • మొత్తం మరణాలు: 4,70,530
  • యాక్టివ్​ కేసులు: 99,974
  • మొత్తం కోలుకున్నవారు: 3,40,53,856

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. శుక్రవారం 73,63,706 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,26,53,44,975కు చేరిందని స్పష్టం చేసింది.

World Covid cases

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 703,750 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్కరోజే 7,536 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 265,175,965కు చేరింది. మరణాల సంఖ్య 5,257,959కు పెరిగింది.

  • US covid cases: అమెరికాలో ఒక్కరోజులో 147,434 కరోనా కేసులు బయటపడ్డాయి. 1,352 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • Germany covid cases: జర్మనీలో 70,681 కేసులు వెలుగులోకి వచ్చాయి. 399 మంది మహమ్మారితో మృతిచెందారు.
  • France covid cases: ఫ్రాన్స్​లో 49,858 కరోనా కేసులు బయటపడ్డాయి. 127 మంది మరణించారు. 14,543 మంది కోలుకున్నారు.
  • UK covid cases: బ్రిటన్​లో 50,584కొవిడ్ కేసులు నమోదుకాగా.. 143 మంది చనిపోయారు.
  • Russia covid cases: రష్యాలో కొత్తగా 32,930 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి మరో 1,217 మంది మృతిచెందారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.