ETV Bharat / bharat

Covid Cases In India Today: 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

author img

By

Published : Dec 6, 2021, 9:42 AM IST

Updated : Dec 6, 2021, 10:45 AM IST

corona cases
కొవిడ్ కేసులు

Covid Cases In India Today: దేశంలో కొత్తగా 8,306 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 211మంది మరణించారు. మరో 8,834 మంది కోలుకున్నారు.

Covid Cases In India Today: దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,306 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 211 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 34,641,561‬
  • మొత్తం మరణాలు: 4,73,537
  • యాక్టివ్​ కేసులు: 98,416
  • మొత్తం కోలుకున్నవారు: 3,40,69,608

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఆదివారం 24,55,911 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,27,93,09,669కు చేరిందని స్పష్టం చేసింది.

దేశంలో అర్హులైనవారిలో 50శాతం మందికి పైగా రెండు డోసులు కొవిడ్​ వ్యాక్సిన్ అందించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ ఆదివారం చేసిన ట్వీట్​ను షేర్​ చేశారు మోదీ.

World Covid cases

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 4,22,421 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్కరోజే 4,008 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 26,61,23,844కు చేరింది. మరణాల సంఖ్య 52,70,662కు పెరిగింది.

  • US covid cases: అమెరికాలో ఒక్కరోజులో 35,065 కరోనా కేసులు నమోదయ్యాయి. 155 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • Germany covid cases: జర్మనీలో 35,983 కేసులు వెలుగులోకి వచ్చాయి. 74 మంది మహమ్మారితో మృతిచెందారు.
  • France covid cases: ఫ్రాన్స్​లో 42,252 కరోనా కేసులు బయటపడ్డాయి. 29మంది మరణించారు. 3,192 మంది కోలుకున్నారు.
  • UK covid cases: బ్రిటన్​లో 43,992కొవిడ్ కేసులు నమోదుకాగా.. 54 మంది చనిపోయారు.
  • Russia covid cases: రష్యాలో కొత్తగా 32,602మందికి వైరస్​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి మరో 1,206 మంది మృతిచెందారు.

Tags: covid news india, covid cases in india, coronavirus india, coronavirus vaccine india, covid 19 india, covid cases in india today

ఇదీ చూడండి: దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్​ కేసులు- రాజస్థాన్​లో 9 మందికి వైరస్​​

Last Updated :Dec 6, 2021, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.