ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్​లో కాస్త తగ్గుముఖం

author img

By

Published : Aug 31, 2022, 9:39 AM IST

Updated : Aug 31, 2022, 9:56 AM IST

corona cases
corona cases

Corona Cases in India : భారత్​లో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి 45 మంది బలయ్యారు. ఒక్కరోజులో 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 7,231 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 45 మంది మరణించారు. ఒక్కరోజులో 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,08,132
  • క్రియాశీల కేసులు: 64,667
  • మొత్తం మరణాలు: 5,27,874
  • కోలుకున్నవారు: 4,38,35,852

Vaccination In India : దేశంలో మంగళవారం 22,50,854 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,12,39,92,816కు చేరింది. ఒక్కరోజే 3,52,166 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 543,810 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,559 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 607,049,587కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,491,720మంది మరణించారు. శనివారం మరో 6,64,326 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 582,970,193కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,25,907 కేసులు వెలుగుచూశాయి. మరో 248 మందికిపైగా మరణించారు.
  • దక్షిణ కొరియాలో 1,15,519 కొవిడ్​ కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో 49,906 కొత్త కేసులు, 251 మరణాలు వెలుగుచూశాయి.
  • రష్యా, ఇటలీ, జర్మనీ, తైవాన్, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి: 'భర్త పనిచేసే ఆఫీసుకెళ్లి మరీ భార్య వేధించడం క్రూరత్వమే'

అంధత్వం అడ్డురాలేదు.. పట్టుదలతో సాధించాడు.. లక్షల్లో జీతంతో మైక్రోసాఫ్ట్​లో కొలువు

Last Updated :Aug 31, 2022, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.