ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. 12వేల దిగువకు కేసులు

author img

By

Published : Jun 26, 2022, 9:44 AM IST

covid cases in india
covid cases in india

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 11,739 మందికి వైరస్​ సోకింది. మరో 25 మంది చనిపోయారు. 10,917 మంది కోలుకున్నారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 11,739 మంది వైరస్​ బారినపడగా.. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 10,917మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.58 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.21 శాతం వద్ద ఉండగా.. డైలీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,389,973
  • మొత్తం మరణాలు: 524999
  • యాక్టివ్​ కేసులు: 92,576
  • కోలుకున్నవారి సంఖ్య:4,27,72,398

Vaccination India: భారత్​లో శనివారం 12,72,739 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,08,51,580 కోట్లకు చేరింది. మరో 4,53,940 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 442,791 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 827 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 63,50,240 చేరింది. ఒక్కరోజే 307,082 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 523,479,348గా ఉంది.

  • జర్మనీలో ఒక్కరోజే 89,336 కొత్త కేసులు బయటపడగా.. 84 మంది మరణించారు.
  • ఇటలీ ఒక్కరోజే 56,386మంది కొవిడ్​ బారినపడగా..40 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 43,667 కేసులు వెలుగుచూశాయి. 62 మందికిపైగా చనిపోయారు.
  • తైవాన్​లో 40,398 కొత్త కేసులు నమోదుకాగా.. 151మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 31,230 కేసులు నమోదు కాగా.. 136మంది మరణించారు.

ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 15,940 మందికి వైరస్.. పెరిగిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.