ETV Bharat / bharat

'కార్బెవాక్స్‌' బూస్టర్​ డోసుకు ఆమోదం.. వారు సైతం తీసుకోవచ్చు!

author img

By

Published : Jun 4, 2022, 6:59 PM IST

corbevax vaccine india: కార్బెవాక్స్​ కరోనా టీకా బూస్టర్​ డోసుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ తీసుకున్నప్పటికీ బూస్టర్​ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్​గా కార్బెవాక్స్​ నిలిచింది.

DCGI approves Corbevax
బూస్టర్‌ డోసుగా కార్బెవాక్స్‌

corbevax vaccine india: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఇ రూపొందించిన కార్బెవాక్స్‌ టీకా బూస్టర్‌ డోసుగా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. అయితే గతంలో కొవిషీల్డ్‌ కానీ, కొవాగ్జిన్‌ తీసుకున్నప్పటికీ.. ఈ టీకాను బూస్టర్‌ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్‌గా కార్బెవాక్స్‌ ఘనత సాధించింది. డీసీజీఐ నిర్ణయంపై బయోలాజికల్‌-ఇ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల హర్షం వ్యక్తం చేశారు.

" ఈ ఆమోదం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. దేశంలోని బూస్టర్‌ డోసుల అవసరాన్ని పరిష్కరించే అవకాశం లభించింది’ అని పేర్కొన్నారు. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కార్బెవాక్స్‌ ప్రికాషనరీ డోసు పొందవచ్చు."

- మహిమ దాట్ల, బయోలాజికల్‌-ఇ మేనేజింగ్ డైరెక్టర్

కార్బెవాక్స్‌ టీకాను ప్రస్తుతం 12 నుంచి 17ఏళ్ల పిల్లలకు అందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 10కోట్ల డోసులను బయోలాజికల్‌-ఇ సరఫరా చేసింది. మరోవైపు తేలికగా ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్‌ వృథా అరికట్టేందుకుగానూ ఒక్క డోసును ఒకే వయల్‌ (బాటిల్‌)లో అందుబాటులో తీసుకువచ్చింది. కొద్దిరోజుల క్రితమే టీకా ధరను సంస్థ భారీగా తగ్గించింది. గతంలో డోసుకు రూ.840గా ఉండగా దీన్ని రూ.250 (పన్నులతో కలిపి)కి తగ్గించినట్లు గత నెలలో ప్రకటించింది.

ఇదీ చూడండి: తాగుబోతు కోడిపుంజు.. మందు లేనిదే ముద్ద ముట్టదట!

డ్రగ్స్​ కోసం డబ్బులు అడిగాడని యువకుడి దారుణ హత్య.. అందరి ముందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.