ETV Bharat / bharat

'పరస్పర సహకారంతోనే ఉమ్మడి శత్రువుపై పోరు'

author img

By

Published : Mar 17, 2021, 4:50 PM IST

దేశాలు తమపై తామే ఆధారపడవచ్చనే పాఠాన్ని కరోనా నేర్పిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ పాఠాలను అన్ని ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అమలు చేయాలని హితవు పలికారు. ఉమ్మడి శత్రువుపై కలిసి పోరాటం చేయవచ్చనే విషయాన్ని కూడా కరోనా తెలియజెప్పిందన్నారు. ప్రపంచాన్ని అనుసంధానం చేస్తున్న డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, నౌకా మార్గాలు, విమానయాన వ్యవస్థలను విపత్తులపై పోరాటానికి వినియోగించుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

Cooperation must for ensuring resilience of global systems: PM Modi
'పరస్పర సహకారంతోనే ఉమ్మడి శత్రువుపై పోరు'

విపత్తులపై పోరుకు దేశాల మధ్య సహకారం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'విపత్తులపై పోరాటానికి మౌలిక సదుపాయాలు' అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంభవించిన విపత్తులు మరో ప్రాంతానికి వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపిన ప్రధాని... దీన్ని అరికట్టేందుకు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దేశాలు తమపై తామే ఆధారపడవచ్చనే పాఠాన్ని కరోనా నేర్పిందన్న ప్రధాని.. ఈ పాఠాలను అన్ని ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అమలు చేయాలని హితవు పలికారు.

ఉమ్మడి శత్రువుపై కలిసి పోరాటం చేయవచ్చనే విషయాన్ని కూడా కరోనా తెలియజెప్పిందని మోదీ అన్నారు. ప్రపంచాన్ని అనుసంధానం చేస్తున్న డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, నౌకా మార్గాలు, విమానయాన వ్యవస్థలను విపత్తులపై పోరాటానికి వినియోగించుకోవాలని ప్రధాని ప్రపంచ దేశాలకు సూచించారు.

"కరోనా మహమ్మారి పరిస్ధితుల నుంచి నేర్చుకున్న పాఠాలను మరవవద్దు. ఈ పాఠాలు కేవలం ప్రజా ఆరోగ్య విపత్తులకు మాత్రమే కాకుండా ఇతర విపత్తులకు కూడా వర్తిస్తాయి. ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంభవించిన విపత్తు ప్రభావం మరో ప్రాంతానికి వేగంగా విస్తరిస్తుంది. ప్రపంచ వ్యవస్ధల ద్వారా విపత్తులను ఎదుర్కొనేందుకు ....దేశాల మధ్య సహకారం తప్పకుండా ఉండాలి. విపత్తులపై పోరాటానికి మౌలిక సదుపాయాలను దీర్ఘకాల అవసరాలకు అభివృద్ధి చేయాలి. పోరాట వ్యవస్ధను తయారు చేస్తే విపత్తుల నుంచి కేవలం మనల్ని మాత్రమే కాకుండా అనేక భవిష్యత్తు తరాలను కాపాడుకోవచ్చు."

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇదీ చూడండి: 'నిర్ణయాత్మక చర్యలతోనే కరోనా 2.0 కట్టడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.