ETV Bharat / bharat

'కాంగ్రెస్ వైఫల్యంపై సమీక్ష జరపాలి'

author img

By

Published : May 6, 2021, 10:43 AM IST

ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోర పరాభవం చవిచూసింది. బంగాల్​లో ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది. అయితే.. పార్టీ వైఫల్యంపై సమీక్ష జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు.

kapil sibal
కపిల్ సిబాల్, కాంగ్రెస్ నేత

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఫల్యానికి కారణమేంటో సమీక్షించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు.

"ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ విఫలమైంది. అసోం, కేరళలో పరాభవం చవిచూసింది. బంగాల్​లో ఒక్క స్థానం సంపాదించలేకపోయింది."

--కపిల్ సిబాల్, కాంగ్రెస్ సీనియర్ నేత.

సరైన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యంపై మాట్లాడుతానని కపిల్ సిబాల్ అన్నారు. ప్రస్తుతం అందరు నేతలు కొవిడ్ నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలమని మోదీ చెప్పాలని అన్నారు.

బంగాల్​లో విజయం సాధించిన మమత బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా రోగులకు ఆటో సేవలు- ఉపాధ్యాయుడి ఉదారత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.