ETV Bharat / bharat

'మోదీ ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు.. 21% మందికే టీకా'

author img

By

Published : Oct 22, 2021, 5:47 PM IST

దేశంలో 21శాతం మందికి మాత్రమే రెండుడోసులు పంపిణీ చేసి 31శాతం మందికి వ్యాక్సిన్‌ పూర్తిచేసినట్లు ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. కరోనాతో చనిపోయిన 4 లక్షల 53వేల మందికి సంతాపం తెలపకుండా.. ప్రధాని సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తింది.

Congress
'మోదీ ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు.. 21% మందికే టీకా'

కరోనా టీకా పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. 21శాతం మందికి మాత్రమే రెండుడోసులు పంపిణీ చేసి 31శాతం మందికి వ్యాక్సిన్‌ పూర్తిచేసినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. గతంలో హామీ ఇచ్చినట్లు ఈ ఏడాది చివరికల్లా 18 ఏళ్లుపైబడిన అందరికీ ఏవిధంగా టీకా పంపిణీ చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్‌ చేసింది.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ద్రవ్యోల్బణం, ఉగ్రవాదం గురించి ప్రస్తావించకపోవటాన్ని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ తప్పుపట్టారు. కరోనాతో చనిపోయిన 4 లక్షల 53వేల మందికి సంతాపం తెలపకుండా.... ప్రధాని సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

చైనాపై ద్వంద్వ వైఖరి

మేడ్​ ఇండియాపై కేంద్రం రెండు నాలుకల వైఖరి అవలంభిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. చైనాతో భారత్ వాణిజ్య లోటు 49శాతం పెరగడంపై విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా ఆందోళన వ్యక్తం చేసిన అనంతరం రాహుల్ ఈ విమర్శలు చేశారు. ఓ మీడియా వార్తను కూడా ట్యాగ్ చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది మొదటి 9 నెలల్లో చైనాతో భారత్​ వాణిజ్య విలువ 90 బిలియన్​ డాలర్లను తాకింది. 49 శాతం పెరుగుదల నమోదైంది.

ఇదీ చదవండి: చైనాకు దీటుగా సరిహద్దులో భారత్ యుద్ధ సన్నద్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.