ETV Bharat / bharat

Congress MLA Candidate List 2023 : ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సై.. మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​

author img

By PTI

Published : Oct 15, 2023, 9:35 AM IST

Updated : Oct 15, 2023, 11:10 AM IST

Congress MLA Candidate List 2023 : త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ​ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటిందింది.

Congress MLA Candidate List  2023
Congress MLA Candidate List 2023

Congress MLA Candidate List 2023 : నవంబర్​లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సైమీ ఫైనల్​గా భావించే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ​లో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో భాగంగా మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటిందింది. ఛత్తీస్​గఢ్​లో 30 మంది, తెలంగాణలో 55 మంది అభ్యర్థులతో మొదటి లిస్ట్​ను విడుదల చేసింది.

Madhya Pradesh Assembly Election 2023 : మధ్యప్రదేశ్​లో మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్​నాథ్​ను ఛింద్​వాఢా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్​ కుమారుడు జైవర్ధన్​ సింగ్​.. రఘీగథ్ స్థానం నుంచి పోటీలో దిగారు. జైవర్ధన్ సింగ్ కమల్​ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక బుధనీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​కు పోటీగా నటుడు విక్రమ్ మస్తాల్​ను బరిలోకి దింపింది. 150 సీట్లున్న మధ్యప్రదేశ్​​ అసెంబ్లీకి సుదీర్ఘ మేధోమథనం తర్వాత 144 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.

  • Congress releases a list of 144 candidates for the upcoming Madhya Pradesh Assembly polls

    State Congress President and former cm Kamal Nath to contest from Chhindwara pic.twitter.com/4e6Gx4d37D

    — ANI (@ANI) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chhattisgarh Assembly Election 2023 : ఛత్తీస్​గఢ్​లో.. పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను, అంబికాపుర్ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియోను కాంగ్రెస్ పోటీకి దింపింది. అయితే ఛత్తీస్​గఢ్​లో అభ్యర్థుల ఎంపికలో చాలా రోజులుగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పాత నాయకులు తమకు టికెట్​ వస్తుందో లేదో అని సందేహం వ్యక్తం చేయగా.. పాత నాయకుల్లో అర్హులైన వారికి కచ్చితంగా టికెట్ కేటాయిస్తామని అంతకుముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

  • Congress releases a list of 30 candidates for the upcoming election in Chhattisgarh

    CM Bhupesh Baghel to contest from Patan, Deputy CM TS Singh Deo from Ambikapur pic.twitter.com/GYwidZZZis

    — ANI (@ANI) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Raipur: Chhattisgarh Deputy CM TS Singh Deo says, "...I am extremely thankful to Congress High Command...We will try to continue the work we started five years ago...New things will need to be done. To achieve all these targets, we will ask for the opportunity." https://t.co/EYMCwheDhG pic.twitter.com/S68hghbzaJ

    — ANI (@ANI) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే కొన్ని హైప్రొఫైల్​ స్థానాలు మినహా మిగతా సీట్లలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్​కు సవాల్​గా మారింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టికెట్​ అశావహులు తమ అభ్యర్థనలను అధిష్ఠానానికి తెలియజేశారు. అనేక నియోజకవర్గాల్లో 100పైగా వినతులు వచ్చాయి. అనంతరం వాటిని స్క్రీనింగ్​ కమిటీ బ్లాక్​ స్థాయిలో షార్ట్​లిస్ట్​ చేసి.. హైకమాండ్​కు పంపించింది. చాలా రోజుల చర్చ, ఒక్కోక్కరి పేరుపై మేధోమథనం చేసి అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.​ అయితే 90 సీట్లకు గానూ 2000 మంది ఆశావహులు తమ వినతులు సమర్పించారని కాంగ్రెస్​ వర్గాల సమాచారం.

ఎన్నికల తేదీలు..
మధ్యప్రదేశ్​లో నవంబర్​ 17న, ఛత్తీస్​గఢ్​లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతల్లో ఎలక్షన్స్​ జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడుతాయి.

Madhya Pradesh Election 2023 : మధ్యప్రదేశ్​ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్.. బీజేపీ X కాంగ్రెస్​ సంగ్రామంలో విజేత ఎవరో?

Chhattisgarh Assembly Election 2023 : ఛత్తీస్​గఢ్​లో మళ్లీ కాంగ్రెస్​ వైపే గాలి! బీజేపీ అద్భుతం చేస్తుందా?

Last Updated : Oct 15, 2023, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.