ETV Bharat / bharat

బంగాల్​లో ప్రచారం చేయనున్న సోనియా​ గాంధీ

author img

By

Published : Mar 23, 2021, 6:24 AM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారకర్తల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​. మూడో దశ ఎన్నికల ప్రచారానికి గానూ.. మొత్తం 30 మందిని నియమించింది. గతంలో.. పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసిన అసమ్మతి నేతలను(జీ 23) దాదాపు దూరం పెట్టింది హస్తం పార్టీ.

Congress announces star campaigners for 3rd phase of West Bengal polls
బంగాల్​ కాంగ్రెస్​ ప్రచారకుల్లో 'జీ23'లకు ఉద్వాసన

బంగాల్​లో మూడో దశ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్​.. పార్టీ ప్రచార తారలను ప్రకటించింది. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, అధీర్​ రంజన్​ చౌదరీలు ఇందులో ఉన్నారు.

ఇంకా రాజస్థాన్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన యువనేత సచిన్​ పైలట్​ సహా.. ఎంపీ మనీష్​ తివారీకి చోటు దక్కింది.

Star campaigners list of Bengal Congress
30 మంది ప్రచారకుల జాబితా

ముఖ్యమంత్రులు అశోక్​ గహ్లోత్​, అమరీందర్​ సింగ్​, భూపేశ్​ బఘేల్​, కాంగ్రెస్​ ముఖ్య ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా, నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ(పంజాబ్ మాజీ మంత్రి​)లకూ చోటు కల్పించింది హస్తం పార్టీ.

వారికి దక్కని ప్రాధాన్యం..

పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ గతంలో అధిష్ఠానానికి లేఖరాసిన జీ-23 సభ్యుల్లో చాలామందిని పక్కనపెట్టింది హస్తం పార్టీ.

కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం​ నబీ ఆజాద్​, కపిల్​ సిబల్​ వంటి సీనియర్​ నాయకులనూ విస్మరించడం గమనార్హం. అయితే.. జీ 23లో మరో సభ్యుడైన జితిన్​ ప్రసాదను ప్రచారకుల జాబితాలో చేర్చింది.

బంగాల్​లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా.. ఎనిమిది దశల్లో పోలింగ్​ జరగనుంది.

ఇదీ చదవండి: బంగాల్​ ఎన్నికలు: 39 మందితో కాంగ్రెస్​ జాబితా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.