ETV Bharat / bharat

BRS Office in Delhi: దిల్లీలో BRS కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

author img

By

Published : May 4, 2023, 1:19 PM IST

Updated : May 4, 2023, 7:16 PM IST

Etv Bharat
Etv Bharat

BRS Office in Delhi: భారత్‌ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభమైంది. దిల్లీ వసంత్‌ విహార్‌లో 4 అంతస్తులతో నిర్మించిన ఈ భవనాన్ని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఉదయం నుంచి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన కార్యాలయంలో కేసీఆర్‌ ఆసీనులయ్యారు. నాడు జలదృశ్యం.. నేడు దిల్లీలో అద్వితీయ దృశ్యం అని కేటీఆర్ పేర్కొన్నారు.

BRS Office in Delhi: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించి.. ఇటీవల జాతీయ పార్టీగా మారిన గులాబీపార్టీ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ రాజధాని దిల్లీలో నిర్మించిన బీఆర్​ఎస్ నూతన కార్యాలయాన్ని పార్టీ అధినేత చంద్రశేఖరరావు ప్రారంభించారు. మధ్యాహ్నాం ఒంటి గంటా 5 నిమిషాలకు.. కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వేదపండితులు ఉదయం సుదర్శన హోమం, వాస్తు పూజలు నిర్వహించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్‌తోపాటు పార్టీ నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు.

దిల్లీలో BRS కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌: ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి దిల్లీకి చేరుకున్నారు. ఆయనకు దిల్లీలో ఉన్న నేతలు ఘనస్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. తన ఛాంబర్​లో సీఎం కేసీఆర్ ఆసీనులయ్యారు. కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కేకే, మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్​ఎస్ నేతలు పాల్గొన్నారు.

1500 గజాల స్థలంలో 3 అంతస్తుల భవనం నిర్మాణం: దిల్లీ వసంత్ విహార్​లోని 100మీటర్ల స్థలంలో 4 అంతస్తులతో 11వేల చదరపు అడుగుల స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అధ్యక్షుడి కోసం.. ప్రత్యేకంగా ఒక క్యాబిన్, అతిథుల కోసం రెండు ప్రత్యేక సూట్స్, ప్రధాన కార్యదర్శుల కోసం 4 ఛాంబర్లు నిర్మించారు. భవనం మొదటి అంతస్తులో అధ్యక్షుడి ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన పార్టీ నేతలు.. 2, 3 అంతస్తుల్లో మొత్తం 18 రూములు నిర్మించారు. పార్టీ కార్యాలయానికి వచ్చే వారి భోజన అవసరాలకు.. ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్​కు చేరుకున్నారు.

నాడు జలదృశ్యం.. నేడు దిల్లీలో అద్వితీయ దృశ్యం: దిల్లీలో బీఆర్​ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నాడు జలదృశ్యం.. నేడు దిల్లీలో అద్వితీయ దృశ్యం అని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్న ఆయన.. బీఆర్​ఎస్ జాతీయ ప్రస్థానం.. నేడు ఒక చారిత్రక అవసరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ మోడల్‌పైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 4, 2023, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.