ETV Bharat / bharat

హోంవర్క్​ చేయలేదని విద్యార్థిని కొట్టిచంపిన టీచర్​!

author img

By

Published : Oct 21, 2021, 7:24 AM IST

హోంవర్క్​ చేయలేదన్న కారణంతో 7వ తరగతి విద్యార్థిని చితకబాదాడు ఓ టీచర్​. విద్యార్థి తలని నేలకేసి కొట్టడం వల్ల అతను స్పృహ కోల్పోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన రాజస్థాన్​ కోలాసర్​ గ్రామంలో జరిగింది.

Teacher beat child to death for not doing homework in Churu
హోంవర్క చేయాలేదని విద్యార్థిని కొట్టిచంపిన టీచర్​!

రాజస్థాన్​ చురు జిల్లా కోలాసర్​ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూలులో.. 13ఏళ్ల విద్యార్థి గణేశ్ బుధవారం మరణించాడు. మనోజ్​ అనే టీచర్​.. గణేశ్​ను దారుణంగా కొట్టడం వల్లే గణేశ్​ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. హోంవర్క్​ చేయలేదన్న కారణంతో మనోజ్​ కోపం తెచ్చుకున్నట్టు సమాచారం.

ఏం జరిగింది?

సాలాసర్​ పోలీసుల కథనం ప్రకారం.. 7వ తరగతి చదువుతున్న గణేశ్​ ఎప్పటిలాగే బుధవారం పాఠశాలకు వెళ్లాడు. అయితే అతను హోంవర్క్​ చేయలేదని మనోజ్​కు తెలిసింది. దీంతో ఉదయం 9:15 ప్రాంతంలో మనోజ్​ గణేశ్​ దగ్గరకు వెళ్లాడు. అందరు చూస్తుండగానే మనోజ్​ తలను నేలకేసి కొట్టాడు. గణేశ్​ శరీరంపై పిడిగుద్దులతో విరుచుకపడ్డాడు. దీంతో గణేశ్​ స్పృహ కోల్పోయాడు. ఇదంతా క్లాసులోని విద్యార్థుల సమక్షంలో జరిగింది. వారందరూ భయంతో వణికిపోయారు.

గణేశ్​ ఎంతకీ లేకపోవడం వల్ల అతను మరణించినట్టు నాటకం ఆడుతున్నాడని మనోజ్​ భావించాడు. ఈ విషయాన్నే గణేశ్​ తండ్రి ఓంప్రకాశ్​కు ఫోన్​ చేసి చెప్పాడు. ఈలోగా.. గణేశ్​ ముక్కు నుంచి రక్తం కారడాన్ని గమనించిన మనోజ్​.. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి రాకముందే గణేశ్​ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

కొడుకు మరణించాడన్న వార్త తెలుసుకుని తండ్రి ఓంప్రకాశ్​ తీవ్రంగా బాధపడ్డాడు. మనోజ్​ గురించి గత కొంతకాలంగా గణేశ్​ తనకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. టీచర్​ తనను అనవసరంగా కొడుతున్నట్టు 15రోజుల్లో 4-5 సందర్భాల్లో తనకి చెప్పి బాధపడినట్టు వెల్లడించాడు.

ఓంప్రకాశ్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మనోజ్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గణేశ్​ మృతదేహానికి పంచమానా ముగిసిన అనంతరం కుటుంబానికి అందించారు.

ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్​ సింగ్​ విచారం వ్యక్తం చేశారు. తక్షణమే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.