ETV Bharat / bharat

'మంత్రించి తెచ్చిన నిమ్మకాయే ఊపిరి తీసింది' - కంటతడి పెట్టిస్తున్న ఘటన

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 12:51 PM IST

Updated : Jan 11, 2024, 7:06 PM IST

child-died-lemon-stuck-her-throat
మంత్రించిన నిమ్మకాయే తమ బిడ్డ ఊపిరి తీస్తుందని ఊహించలేకపోయారు

child died lemon stuck in throat : సంతానం కోసం ఆ దంపతులు ఎక్కని మెట్టు లేదు. మొక్కని దేవత లేదు. ఏడేళ్లకు కడుపు పండడంతో కలలు కన్నారు. ఆడపిల్ల పుట్టడం అదృష్టంగా భావించారు. చక్కగా చదివించాలని ప్రణాళికలూ వేసుకున్నారు. కానీ, కడుపున 9నెలలు, పుట్టిన మరో తొమ్మిది నెలలకే ఆ పసికందు వారికి దూరమైంది. ఊహించని విధంగా మృత్యువు బలితీసుకుంది.

child died lemon stuck in throat : ఏడేళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ పుట్టడంతో ఆ దంపతులు మురిసిపోయారు. చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. బుడిబుడి అడుగులు వేస్తుంటే చూసి మురిసిపోయేవారు. కానీ, వారి ఆనందం ఎంతో దూరం నిలవలేదు. విధికి కన్ను కుట్టిందేమో..! ఊహించని ప్రమాదంలో ఆ చిన్నారి కన్నుమూసింది.

ఇంటి వద్దే కాచుకున్న మృత్యువు - మూడేళ్ల బాలుడిని మింగేసిన విద్యుత్ స్తంభం

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఓ చిన్నారి కన్నుమూసింది. గ్రామానికి చెందిన వాలంటీరు సఖీదీప, గోవిందరాజు దంపతుల కుమార్తె జశ్విత (9నెలలు) ఆడుకుంటూ నిమ్మకాయను నోట్లో పెట్టుకుంది. తల్లి గమనించి దాన్ని తీసేందుకు ప్రయత్నించగా గొంతులోకి జారుకుంది. చికిత్స కోసం హుటాహుటిన పెద్దవడుగూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడింది. మెరుగైన వైద్యం కోసం పామిడికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పసికందు మృతితో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారి మృతదేహంపై పడి బోరున విలపించారు. ఏడేళ్ల తర్వాత పుట్టిన బిడ్డను లేకుండా చేశావా దేవుడా అంటూ గుండెలు పగిలేలా రోదించారు.

పుట్టినరోజునే తిరిగిరాని లోకాలకు.. స్కూల్లో తల మీద బండ పడి చిన్నారి మృతి

దేవుడి దగ్గర నుంచి తీసుకువచ్చిన నిమ్మకాయ తన చిన్నారి దగ్గర ఉంచితే ఆరోగ్యంతో ఉంటుందని భావించారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ నిమ్మకాయ ఆ చిన్నారి ఊపిరి పోవడానికి కారణమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మల్లేనిపల్లి గ్రామానికి చెందిన సుఖ దీప అనే మహిళకు శుభశ్రీ అనే తొమ్మిది నెలల చిన్నారి ఉంది. చిన్నారి ఆరోగ్యం బాగుండాలని దేవుడి వద్దకు వెళ్లి మంత్రించిన నిమ్మకాయను తెచ్చి చిన్నారి వద్ద ఉంచింది.

విషాదాన్ని నింపిన పదేళ్ల చిన్నారి మరణం - తండ్రి ఆటో నడుపుతుండగా జారిపడి

నిమ్మకాయ చూస్తూ ఆడుకుంటున్న చిన్నారి దానిని నోట్లో వేసుకుంది. దీంతో గొంతులో నిమ్మకాయ ఇరుక్కొని చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు వెంటనే 108 అంబులెన్స్ వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చిన్నారి మృతదేహంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆరోగ్యంగా ఉండాలని నిమ్మకాయ తెస్తే చివరికి అదే ప్రాణం తీసిదంటూ బోరున విలపించారు.

అయ్యో పాపం.. పాప ప్రాణం తీసిన వేరు శనగ గింజ

Last Updated :Jan 11, 2024, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.