ETV Bharat / bharat

'లఖింపుర్​ బాధిత కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం'

author img

By

Published : Oct 6, 2021, 5:23 PM IST

lakhimpur incident news
రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం

లఖింపుర్​ ఘటనలో (Lakhimpur Kheri Incident) మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు పంజాబ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు పంజాబ్​ సీఎం చన్నీ.

లఖింపుర్​ ఘటనలో (Lakhimpur Kheri Incident) ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఛత్తీస్​గఢ్​, పంజాబ్​ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఘర్షణల్లో మృతిచెందిన నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు కుటుంబానికి రూ. 50 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడించాయి.

'జలియన్​వాలా బాగ్​ ఘటన గుర్తుకొచ్చింది'

లఖింపుర్​ ఖేరిలో జరిగిన హింసాకాండ (Lakhimpur Kheri Incident) తనకు జలియన్​వాలా బాగ్​ ఘటనను గుర్తుకు తెచ్చిందన్నారు పంజాబ్​ సీఎం చన్నీ. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు.

లఖింపుర్​ ఘటన..

యూపీలోని లఖింపుర్​ ఖేరీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, యూపీ ఉపముఖ్యమంత్రి కాన్వాయ్​లను అడ్డుకున్న రైతులపై వాహనాలు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో మరో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు భాజపా కార్యకర్తలు, కేంద్ర సహాయక మంత్రి కారు డ్రైవర్​, ఓ జర్నలిస్టు మృతిచెందారు.

ఇదీ చూడండి : 'లఖింపుర్​ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.