ETV Bharat / bharat

Lakhimpur Kheri News: 'కారుతో తొక్కించి.. కాల్పులు జరిపి'

author img

By

Published : Oct 6, 2021, 5:06 AM IST

Lakhimpur Kheri
లఖింపుర్​ ఖేరీ

కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్​ మిశ్రా(Ashish mishra bjp) కారు రైతులపైకి దూసుకెళ్లినట్లు ఎఫ్​ఐఆర్​లో స్పష్టం చేశారు ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు. అంతేకాక రైతులపై మిశ్రా.. కాల్పులు జరిపారని, పథకం ప్రకారమే ఈ ఘటన జరిగినట్లు ఎఫ్​ఐఆర్​లో వివరించారు పోలీసులు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా(మోను)(Ashish mishra bjp) కారు రైతులపైనుంచి(Farmers protest news) దూసుకెళ్లినట్లు ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లో ఉంది. ఆ సమయంలో మిశ్రా.. కారులోనే ఉన్నారని రైతులపై ఆశిష్ కాల్పులు జరిపినట్లు ఎఫ్​ఐఆర్​లో నమోదైంది. బహ్​రెయిచ్ జిల్లాకు చెందిన జగ్​జీత్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

" కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, అతని కుమారుడు ఆశిష్ మిశ్రా.. పథకం ప్రకారమే రైతులపై దాడి చేశారు. అజయ్ మిశ్రా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్లే.. రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రైతులు నల్లబ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మహారాజా అగ్రసేన్ ఇంటర్​ కాలేజీ గ్రౌండ్​కు వచ్చారు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆశిష్ మిశ్రా.. 15-20 మందితో మూడు కార్లలో బన్​బిర్​పుర్​లోని నిరసన ప్రదేశానికి వచ్చారు. ఆశిష్ మిశ్రా రైతులపై కాల్పులు జరిపారు. "

-- ఎఫ్​ఐఆర్ ప్రకారం

అయితే.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని(lakhimpur violence news), దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధమని.. లఖింపుర్​ హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్​ మిశ్రా వెల్లడించారు.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur kheri news) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా- బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

తమపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: ఉద్రిక్తతల మధ్య లఖింపుర్​కు రాహుల్​ గాంధీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.