ETV Bharat / bharat

జికా వైరస్​పై కేంద్రం హైఅలర్ట్- ప్రత్యేక బృందంతో...

author img

By

Published : Jul 9, 2021, 6:12 PM IST

Updated : Jul 9, 2021, 7:21 PM IST

జికా వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరుగురు సభ్యులున్న కేంద్ర నిపుణుల బృందం.. కేరళకు బయలుదేరింది. వైరస్​ వ్యాప్తిని పర్యవేక్షించడం సహా​ కేసుల నిర్వహణలో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహకరించనుంది. మరోవైపు.. వైరస్​ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కేరళ ప్రభుత్వం రూపొందించింది.

Zika virus
జికా వైరస్​

కేరళలో జికా వైరస్​ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆరుగురు సభ్యులున్న నిపుణుల బృందాన్ని కేరళకు పంపింది.

"ప్రజా ఆరోగ్య నిపుణులు, వ్యాధి నిపుణులు, ఎయిమ్స్​కు చెందిన వైద్యులు ఉన్న ఆరుగురు సభ్యులున్న బృందం కేరళకు బయలుదేరింది. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిచడం సహా వైరస్​ కేసుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి వీరు సహకరించనున్నారు."

-లవ్​ ఆగర్వాల్​, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

జికా వైరస్ తొలి కేసు తిరువనంతపురంలోని పరస్సాలలో నమోదైంది. ఓ 24 ఏళ్ల గర్భిణికి వైద్యులు గురువారం పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఈ వైరస్​ సోకినట్లు వెల్లడైంది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డలో వైరస్‌ లక్షణాలు లేనందున వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ఆసుపత్రిలోని 19 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు జికా వైరస్​ లక్షణాలని వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్​కు మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.

స్పెషల్​ యాక్షన్​ ప్లాన్​...

జికా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇందులో భాగంగా.. నమూనాలను పరీక్షించేందుకు ఓ అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గర్భిణులకు ఈ వైరస్​ ముప్పు ఎక్కువగా పొంచి ఉన్న నేపథ్యంలో... లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు.

ఇదీ చూడండి: 'లామ్డా' వేరియంట్​పై కేంద్రం కీలక ప్రకటన

ఇదీ చూడండి: Kappa Variant: ఆ రాష్ట్రంలో కప్పా వేరియంట్ కలకలం!

Last Updated : Jul 9, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.