ETV Bharat / bharat

సీబీఐ చేతికి బీర్భుమ్​ కేసు.. విచారణ షురూ

author img

By

Published : Mar 26, 2022, 5:28 AM IST

Birbhum killings
Birbhum killings

Birbhum killings: పశ్చిమ బంగాల్‌లోని బీర్భుమ్​ హింస కేసును సీబీఐ విచారణ చేపట్టింది. అంతకుముందు బీర్భుమ్​ హింసపై సీబీఐ విచారణ జరపాలని కోల్​కతా హైకోర్టు ఆదేశించింది.

Birbhum killings: బంగాల్​లో బీర్భుమ్​ సజీవ దహనాల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. మార్చి 26నుంచి విచారణ ప్రారంభించనుంది. అంతకుముందు బీర్భుమ్​ హింసపై సీబీఐ విచారణ జరపాలని కోల్​కతా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7లోగా సీబీఐ నివేదిక సమర్పించాలని జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజతో కూడిన ధర్మాసనం తెలిపింది.

ఇదీ జరిగింది

బంగాల్​, రాంపుర్​హట్​ ప్రాంతంలో కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. "తృణమూల్​ కాంగ్రెస్​ నేత, బర్షాల్​ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్​ బహదూర్​ షేక్​ను ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్​హట్​లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. . హత్యకు ముందు బాధితులను తీవ్రంగా కొట్టి అనంతరం సజీవ దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేయగా.. నిర్లక్ష్యం వ్యవహరించిన పలువురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.

ఇదీ చూడండి: అందుకు అడ్డొస్తున్నాడని.. కుమారుడిని హతమార్చిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.