ETV Bharat / bharat

ఓటీపీ చెప్పలేదని ఓలా క్యాబ్ డ్రైవర్ దాడి.. కస్టమర్ మృతి

author img

By

Published : Jul 5, 2022, 12:37 PM IST

Updated : Jul 5, 2022, 7:45 PM IST

తమిళనాడులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓటీపీ చెప్పలేదని కస్టమర్​పై దాడికి పాల్పడ్డాడు ఓలా క్యాబ్​ డ్రైవర్​. ఈ దాడిలో ఉమేందర్​ అనే వ్యక్తి మరణించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ola cab driver killed it employee
ఓలా క్యాబ్ డ్రైవర్

తమిళనాడులో దారుణం జరిగింది. కస్టమర్ ఓటీపీ చెప్పలేదని.. ఓలా క్యాబ్​ డ్రైవర్ అతడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఉమేందర్​ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

అసలేం జరిగిందంటే:
ఉమేందర్ అనే వ్యక్తి చెంగల్పట్టు జిల్లా కన్నివాక్కంకు చెందిన వ్యక్తి. ఈయన కోయంబత్తూరులో సాఫ్ట్​వేర్ ఇంజనీర్​గా పనిచేస్తున్నాడు. శని, ఆదివారాలు సెలవు కావడం వల్ల సొంత గ్రామం కన్నివాక్కంకు కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఆదివారం(జులై 3) అతని భార్య, పిల్లలు, బంధువులతో కలిసి సమీపంలో ఉండే.. ఓఎంఆర్​ రోడ్డులోని సినిమా థియేటర్​కు వెెళ్లాడు.

సినిమా పూర్తయ్యాక ఇంటికి తిరిగి రావడానికి ఓలా యాప్​లో క్యాబ్ బుక్​ చేసుకున్నాడు. ఇన్నోవా కారు వచ్చింది. ఉమేందర్​తో సహా అతని కుటుంబ సభ్యులు కారు ఎక్కారు. ఓలా క్యాబ్ డ్రైవర్​ రవి.. ఉమేందర్​ను ఓటీపీ నంబర్​ చెప్పమన్నాడు. ఓటీపీ చెప్పడంలో కాస్త ఆలస్యం చేశాడు. దీంతో ఓటీపీ సరిగా చెప్పలేదని డ్రైవర్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో వీరివురి మధ్య గొడవ జరిగి అది కాస్త దాడికి దారితీసింది. ఈ దాడిలో ఉమేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్​లో ఉమేందర్​ను ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కేళంబాక్కం పోలీసులు ఓలా క్యాబ్​ డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

'ఆసుపత్రికి వెళ్లా- ప్రియుడితో పారిపోలేదు'.. మహిళ హైడ్రామా.. మాజీ భర్తతో వాగ్వాదం!

పొట్టేళ్లతో వ్యవసాయం.. నాగలితో దున్నడం, బండిని లాగడం అన్నీ వాటితోనే!

Last Updated :Jul 5, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.