ETV Bharat / bharat

ప్రచారంలో దూసుకెళుతున్న బీఆర్​ఎస్​ - నమ్మి ఓటేస్తే మళ్లీ పాతరోజులొస్తాయని హెచ్చరిక

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 5:44 AM IST

BRS Assembly Election Campaign 2023 : గులాబీ శ్రేణులు ప్రచారంలో మరింత జోష్ పెంచాయి. ఓ వైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్, హరీశ్​ రావు సుడిగాలి పర్యటనలో హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులూ వేగం పెంచి ప్రతీ ఓటరును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ఆకర్షణీయ ప్రకటనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు పదేళ్ల పనితీరును వివరిస్తూ.. మరోవైపు ప్రత్యర్థుల ప్రచార అంశాలపై ఎదురుదాడి కొనసాగిస్తున్నారు.

BRS Praja Ashirvada Sabha
BRS Assembly Election Campaign 2023

ప్రచారంలో దూసుకెళుతున్న బీఆర్​ఎస్​ - నమ్మి ఓటేస్తే మళ్లీ పాతరోజులొస్తాయని హెచ్చరిక

BRS Assembly Election Campaign 2023 : ఎన్నికల యుద్ధంలో అస్త్రశస్త్రాలన్నీ బయటకు తీస్తున్న గులాబీ దళం.. ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లింది. ఓ వైపు గులాబీ దళపతి కేసీఆర్.. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ ​రావు సుడిగాలి పర్యటనలతో జోష్ పెంచారు. ఎన్నికల షెడ్యూలు రాగానే నియోజకవర్గాల బాట పట్టిన గులాబీ నేతలు ఓట్ల వేటలో అందరి కంటే ముందున్నారు. రోజుకు మూడు నుంచి 4 ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌ ప్రసంగాల్లో ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచుతున్నారు. ఈనెల 25న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు కలిపి పరేడ్ గ్రౌండ్స్‌లో ఒకే సభను నిర్వహించనున్నారు. హైదరాబాద్ సభ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో.. భారీగా జన సమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 28న ప్రచారం చివరి రోజున వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి ఒకే సభ నిర్వహించి.. తర్వాత గజ్వేల్‌లో ప్రచారం ముగించనున్నారు. కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌, ధరణి, రైతుబంధు కాట్ల కలవడం ఖాయమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆదమరిచి ఓటేస్తే.. మళ్లీ పాతరోజులు రావటం ఖాయమంటూ హితవుపలుకుతున్నారు.

ప్రచారంలో స్పీడ్ పెంచిన కారు - యువ ఓటర్లపై స్పెషల్ ఫోకస్

Telangana Assembly Elections 2023 : గులాబీ అధినేత కేసీఆర్​తో పాటు కేటీఆర్, హరీశ్ ​రావు ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక నజర్ పెట్టిన కేటీఆర్ ఈ నెల 15 నుంచి రోడ్ షోలు విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు కలుస్తున్నారు. పదేళ్లలో నగరాభివృద్ధికి చేసిన మంచి పనులను వివరిస్తున్నారు. హరీశ్​ రావు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. పదేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయాలని అభ్యర్థుల నుంచి అధినేత వరకు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఎదురుదాడి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టాలని.. పొరపాటున కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్లినట్లేనని.. రిస్క్ తీసుకోవద్దని సూచిస్తున్నారు.

BRS Praja Ashirvada Sabha : అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల క్రితమే సిద్ధమైన గులాబీ పార్టీ.. ప్రచారాన్ని వ్యూహాత్మకంగా క్రమంగా వేగం పెంచుతూ వచ్చింది. ఎన్నికల షెడ్యూలు రాకముందే.. సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, కార్యాలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ.. మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభాలు, శంకుస్థాపనలతో ప్రజల్లోకి వెళ్లింది. ఆగస్టులోనే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​.. పార్టీలో అసంతృప్తులు కొంత మేరకు సర్దుబాట్ల కొలిక్కి రాగానే.. ప్రచారంపై దృష్టి పెట్టింది. ప్రచార గడువు ముగిసేలోగా.. ప్రతీ ఓటరును కనీసం మూడు, నాలుగు సార్లు కలవాలని అభ్యర్థులకు బీఆర్​ఎస్​ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం విస్తృతంగా చేశారు.

17 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎగరని బీఆర్ఎస్ జెండా - ఈసారైనా గులాబీ గాలి వీచేనా?

CM KCR Attend Public Meeting : ప్రచారం కోసం అన్ని మార్గాలను వాడుకుంటున్న బీఆర్​ఎస్​.. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది. ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్టులు, రీల్స్ ద్వారా వినూత్న ప్రచారం సాగిస్తోంది. తెలంగాణ రాకముందు ఎట్లుండే.. ఇప్పుడెలా మారిందంటూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయర్స్‌తో రీల్స్ చేయించి ప్రజల్లోకి తీసుకెళ్తోంది. పత్రికలు, టీవీ ఛానెళ్లు, ఎఫ్.​ఎం రేడియో, డిజిటల్ మాధ్యమాల్లో వివిధ భాషల్లో ప్రకటనల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నమూ చేస్తోంది. పాటలు, కళారూపాలతోనూ ప్రచారం సాగిస్తున్నారు. కేసీఆర్ భరోసా పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నారు.

ప్రచారంలో కారు జోరు - నియోజకవర్గాలను చుట్టేస్తున్న కేసీఆర్ సారు - రోడ్​ షోలతో బిజీబిజీగా కేటీఆర్, హరీశ్‌ రావు

BRS Aims for Hattrick Win in Telangana 2023 : పలువురు సీనియర్‌ నేతలను బీఆర్​ఎస్​లో చేర్చుకున్న గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలను ఇస్తోంది. ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ఉద్యమకారులు తమవైపే ఉన్నారని ప్రచారం చేస్తోంది.

అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు- విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం

హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార జోరు - గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.